Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా.. ప్రభాస్ ప్రస్థానమిది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్... ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. 2002 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఎక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరకక్షన్ లో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని సాహో చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కృతి సనన్ తో కలిసి రామాయణ ఇతిహాసం అయిన ఆది పురుష్ సినిమాలో శ్రీరామ చంద్రుడిగా కనిపించాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆయనకు ఉన్న క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం ఓ నాలుగైదు ప్రాజెక్టులు ఉండగా.. బిజీ బిజీగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ప్రభాస్ కెరియర్ తొలి నాళ్లలో ఆయన సినిమాలు కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. ఇప్పుడు ఆయన రేంజ్ 1500 కోట్ల వరకూ చేరిపోయింది. బాహుబలి, సాహో, ఆది పురుష్ వంటి చిత్రాలకు 1500 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టి తీసారు. అలాగే రెమ్యునరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. యమా క్రేజ్ సంపాధించుకున్న డార్లింగ్ కు రేపటితో 44 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈక్రమంలో అంతా ఆయనకు బిలేటెడ్ గా హ్యాపీ బర్త్ డే చెబుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగానే.. సూపర్ డూపర్ హిట్టు చిత్రం ఛత్రపతిని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉండగా జపాన్ లో కూడా ప్రభాస్ అభిమానులు.. ఆయన పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఓ గది నిండా ప్రభాస్ పొటోలు, కటౌట్లు పెట్టి మొత్తం డెకరేట్ చేశారు. పుట్టిన రోజుకు ముందే ఇంతలా చేస్తున్నారంటే ఇంకా రేపు ఏ స్థాయిలో రచ్చ చేస్తారో చూడాలి మరి.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండగా.. డిసెంబర్ 22వ తేదీన పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి మరి. ఇదే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ అనే సినిమాలో కూడా ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు. మరి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల నుంచి రేపు ఏదైనా స్పెషల్ అనౌన్స్ ఉంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











