కీలక ప్రకటన చేసిన పంజా వైష్ణవ్ తేజ్: అలాంటివి నమ్మవద్దంటూ లేఖ విడుదల
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అంతేకాదు, వాళ్లంతా ఇండస్ట్రీలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్న అతడు.. మెగా లెగసీని కంటిన్యూ చేసేలా కనిపించాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మెగా హీరో ఓ ప్రెస్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు.
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)
తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ ఓ ప్రెస్ నోట్‌ను మీడియాకు విడుదల చేశాడు. అందులో తనకు ట్విట్టర్ అకౌంట్ లేదని చెబుతూ ఫ్యాన్స్‌ను అలెర్ట్ చేశాడు. 'నాకు ట్విట్టర్‌లో అధికారిక ఖాతా లేదు. దయచేసి ఫేక్ అకౌంట్లను ఫాలో అవకండి. అందులో ఉన్న సమాచారాన్ని నమ్మకండి. అంతేకాదు, వెంటనే అలాంటి ఖాతాలపై రిపోర్టు చేయండి. ఇలాంటి వాటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)

ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.52 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రూ. 30.52 కోట్ల లాభాలను అందుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సినిమా విడుదల కాకముందే క్రిష్ జాగర్లమూడితో అతడు మరో సినిమాను చేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, ఇప్పుడు అక్కినేని నాగార్జున నిర్మాణంలో నటించేందుకు సంతకం చేసేశాడు. ఇక, 'జాతి రత్నాలు'తో భారీ హిట్ అందుకున్న అనుదీప్ కేవీతోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడను.


Click it and Unblock the Notifications











