Pawan kalyan సినిమాలో మిర్జాపూర్ యాక్టర్.. ఈసారి మరింత పవర్ఫుల్ క్యారెక్టర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిన అనంతరం సినిమా కెరీర్ విషయంలో సరికొత్త అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో మళ్ళీ నటించాలని అనుకోలేదు. కానీ పాలిటిక్స్ లో చేదు అనుభవం ఎదురవడంతో మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు లైన్లోకి తెస్తున్నాడు. ఇక వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు ప్రజాసమస్యలు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. మరొకవైపు కమిట్మెంట్ ప్రకారం సినిమాలను కూడా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగా దర్శకనిర్మాతలు కూడా సరైన ప్రణాళికలతో షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు. అయితే అంచనాల ప్రకారం ఆ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ గా లాభాలను అందించలేకపోయింది. నిర్మాతలు దాదాపు సేఫ్ అయ్యారు కానీ ఆంధ్రా ఏరియాలో మాత్రం కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఎదురయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సినిమా టికెట్లను తగ్గించడంతో అక్కడ ఏరియాలో చాలా వరకు నష్టాలు ఎదురవుతున్నాయి. అయితే ముందుగానే పవన్ కళ్యాణ్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునేందుకు మాట కూడా ఇవ్వడం జరిగింది.

Pankaj Tripathi powerful role in Pawan Kalyan Harish Shankar movie

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలను వీలైనంత త్వరగా పని చేయాలని అనుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదియుడు భగత్ సింగ్ అనే సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు మరి కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా నార్త్ సినీ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్న పంకజ్ త్రిపాఠి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇదివరకే అమెజాన్ మిర్జాపూర్ వెబ్ సీరీస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక భవదియుడు భగత్ సింగ్ సినిమాలో కూడా పంకజ్ త్రిపాఠీ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 16వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెయిన్ కథ గండి కోట చుట్టూ తిరుగుతుంది అని అంతే కాకుండా ఈ చారిత్రాత్మక అంశాలు చాలానే ఉంటాయి అని కథనాలు వెలువడుతున్నాయి. సినిమాకోసం చార్మినార్ గండికోట సెట్స్ కూడా ప్రత్యేకంగా నిర్మించడం విశేషం. ఖుషి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఇక హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X