సాయిధరమ్ తేజ్‌తో సూపర్ హిట్ డైరెక్టర్!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం తేజు కిషోర్ తిరుమల దర్శత్వంలో చిత్రలహరి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ప్రతి కథ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తేజు భావిస్తున్నాడట. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి కథల ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.
తాను త్వరలో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు కూడా పరశురామ్ ప్రకటించారు. కానీ బన్నీ ఈ చిత్రం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథ తనకంటే సాయిధరమ్ తేజ్ కు సరిపోతుందని చెప్పాడట. సాయిధరమ్ తేజ్ తో సినిమా చేయాలనీ పరశురామ్ కు సూచించాడట. దీనికి పరశురామ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

బన్నీ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే తన చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం చిత్రంతో పరశురామ్ ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అటు బన్నీ, ఇటు తేజు చిత్రాల గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











