twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత చెరువులో దూకాడు, ఎన్టీఆర్‌కు తగ్గించుకోమని చెప్పా... విజయ్ దేవరకొండ, నాని కూడా!

    |

    'పరుచూరి పలుకులు' పేరుతో తన సినిమా కెరీర్లోని అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా.... ఎన్టీఆర్ గురించి, రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    విజయ్ దేవరకొండ, నాని... స్టార్ హీరోల కంటే సంవత్సరానికి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని ఇటీవల ఓ ఛానల్‌లో న్యూస్ చూసినపుడు చిన్న రామయ్య(ఎన్టీఆర్) గుర్తుకు వచ్చారంటూ గతంలో జరిగిన ఓ సంఘటనను పరుచూరి రివైండ్ చేసుకున్నారు.

    నిర్మాత హుస్సేన్ సాగర్లో దూకేశాడు

    నిర్మాత హుస్సేన్ సాగర్లో దూకేశాడు

    2005లో నరసింహుడు రిలీజ్ టెన్షన్లో ఉన్నపుడు నిర్మాత ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్లో దూకేసి ఆత్మహత్యా యత్నం చేయడం చాలా బాధేసింది. ఈ సంఘటన చూసి అందులో హీరోగా నటించిన చిన్నాడు(జూ ఎన్టీఆర్) ఎంత బాధపడ్డాడో అనిపించింది. అపుడు రాజమండ్రిలో ఉన్న నేను హైదరాబాద్ రాగానే అతడిని కలవడానికి వెళ్లాను.

    రెమ్యూనరేషన్ తగ్గించుకుని సినిమాలు పెంచమని చెప్పా

    రెమ్యూనరేషన్ తగ్గించుకుని సినిమాలు పెంచమని చెప్పా

    మీరు సంవత్సరానికి ఒకటి లేదా ఒకటిన్నర సినిమా చేస్తున్నారు. ఒక్కోసారి ఒకటిన్నర రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్లో నాలుగోవంతు తీసుకోండి. అలా తీసుకుంటూ మూడు నెలలకు ఒక సినిమా చూప్పున సంవత్సరానికి 4 సినిమాలు చేయమని చిన్నరామయ్యకు చెప్పాను.

    అప్పుడు మిగతా వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుంది

    అప్పుడు మిగతా వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుంది

    చలసాని గోపి, అర్జున్ రాజు, దేవిప్రసాద్, త్రివిక్రమ రావు, అశ్వినీదత్, రామానాయుడు ఇలా మీ తాతగారి నిర్మాతలు 12 మంది సాలిడ్‌గా అలాగే ఉన్నారు. 4 సినిమాల చొప్పున మీరు చేసుకుంటూ వెళ్లిపోతే వారు నీ దగ్గరే ఉంటారు. నీ రెమ్యూనరేషన్ తగ్గగానే ఆటోమేటిక్‌గా మిగతా వారి రెమ్యూనరేషన్ తగ్గుతుందని సూచించాను.

    ఎన్టీఆర్ వినలేదు

    ఎన్టీఆర్ వినలేదు

    తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని చేయడం వల్ల సినిమా మొదటి వారానికి డబ్బులు వచ్చేస్తాయి. ప్లాప్ అనేది నీ చరిత్రలో ఉండదు. సినిమా ఆడిందా? లేదా? కాదు.... సినిమా తీసిన డబ్బులు వచ్చాయా? లేదా? అనేది ముఖ్యం. అలా చేయ్ అంటే చిన్న రామయ్య నవ్వేశాడు. లేదు పెదనాన్న ఇది పోటీ యుగం. ఈ పోటీ యుగంలో ఎక్కడ తలపడాలో అక్కడ తలపడాలి. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికి ఉందో వారితో పోటీ పడుతూ నేనూ తీసుకోవాల్సిందే, ఇలాగే చేస్తాను అన్నాడు.

    ఎందుకో ఇండస్ట్రీ అలా అయిపోయింది

    ఎందుకో ఇండస్ట్రీ అలా అయిపోయింది

    అప్పటికీ, ఇప్పటికీ తనే కాదు... మిగతా హీరోలంతా అలాగే ఉన్నారు. ఒకప్పుడు కృష్ణ, రామారావుగార్ల సినిమాలు సంవత్సరానికి పది నుంచి 12 వచ్చేవి. శోభన్ బాబుగారు, నాగేశ్వరరావుగారు 6, 7, 8 సినిమాలు చేసేవారు. మాస్ హీరోలైన వీరు సంవత్సరానికి 12 సినిమాలు చేసేవారు. అభిమానులు ప్రతి నెలా వారిని చూసి ఆనందపడేవారు. కానీ ఇప్పుడున్న హీరోల అభిమానులకు ఆనందం పోయింది. ఒక హీరో సినిమా పోయిందంటే.. మళ్లీ సక్సెస్ చూడటానికి రెండు సంవత్సరాలు ఆగాల్సి వస్తోంది. ఎందుకో ఇండస్ట్రీ అలా అయిపోయింది.

    తక్కువ తీసుకుంటే తక్కువ స్థాయి హీరోలుగా చూస్తారేమో...

    తక్కువ తీసుకుంటే తక్కువ స్థాయి హీరోలుగా చూస్తారేమో...

    రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటే వారిని తక్కువ స్థాయి హీరోలుగా ఎక్కడ చూస్తారో అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాలుగు చేయక పోయినా కనీసం సంవత్సరానికి 2 సినిమాలైనా చేయండి. కేవలం చిన్న రామయ్యకే కాదు.. అందరు హీరోలకు ఇది నా సూచన. దాని వల్ల మీ అభిమానపులకు ఆరు నెలలకు ఒకసారైనా సినిమా చూసిన తృప్తి కలుగుతుంది... అని పరుచూరి చెప్పుకొచ్చారు.

    English summary
    Paruchuri Gopala Krishna About His Advice to Jr NTR. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Says That He Once Adviced Jr NTR to do 4 Movies Per Year for Which Jr NTR Denied.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X