టీచర్ కొట్టింది ఇంకా గుర్తు: స్నేహితులను, గురువులను కలిసి పాత జ్ఞాపకాల్లోకి పవన్ కళ్యాణ్

Recommended Video

Pawan Kalyan Remembered Many Events That Happened In School Days

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్కూలింగ్ నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన జనసేన పార్టీ మీటింగులో భాగంగా నెల్లూరు వెళ్లిన పవన్ కళ్యాణ్‌కు అప్పుడు పవర్ స్టార్‌తో కలిసి చదువుకున్న స్నేహితులు, టీజర్లు కలిసి సర్పైజ్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఇక్కడకు వచ్చే వరకు ఇక్కడ మా టీచర్లు ఉంటారని తెలియదు. వారి ముందు మాట్లాడటం కూడా భయంగా ఉంది. నా స్నేహితులను, గురువులను కలవడం ఆనందంగా ఉంది అంటూ స్కూలు రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

వారు నేర్పిన విలువల వల్లే...

వారు నేర్పిన విలువల వల్లే...

నాకు మా టీచర్లంతా పాఠాలు నేర్పలేదు. విలువలు నేర్పారు. చాలా మందికి నేను యాక్టర్ అయ్యాక పాలిటిక్స్ మీద ఇంట్రస్ట్ వచ్చింది అని అనుకుంటారు. కానీ నాకు ప్రజా సమస్యలపై ఏదైనా చేయాలనే తపన చిన్నప్పటి నుండి ఉంది. స్కూల్ రోజుల్లో ఉదయం అసెంబ్లీ అయిన తర్వాత ఒక మంచి దేశభక్తి పాట పెట్టి అందరినీ డ్రిల్ చేసుకుంటూ వెళ్లమని చెప్పేవారు. అది నాకు చాలా ఇన్స్‌స్పిరేషన్ గా అనిపించేది. వారు నేర్పిన విలువల వల్లే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాము అని పవన్ కళ్యాణ్ అన్నారు.

విజయ లక్ష్మి టీజర్ కొట్టారు

విజయ లక్ష్మి టీజర్ కొట్టారు

ఒకసారి నన్ను విజయలక్ష్మి టీచర్ కొట్టారు. అప్పటి నుండి నేను ఎవరి చేతిలోనూ దెబ్బలు తినకూడదని జాగ్రత్త పడిపోయేవాడిని. ఆ రోజుల్లో నేను పెద్దగా అల్లరి కూడా చేసేవాడిని కాదు. టీచర్లను ఆటపట్టించే తెలివితేటలు కూడా అప్పటికీ లేవు. కష్టపడి చదువుదామనే తపన ఉండేది. ఓసారి విజయలక్ష్మి టీజర్ నెపోలియన్ పాఠం చెబుతుంటే నా పక్కన ఒక ఫ్రెండ్ నెపోలియన్ ఏ పార్టీ అని అడగమని చెప్పాడు. అతడు చెప్పినట్లే నేను అడిగి వెటకారం చేయడంతో నన్ను టీచర్ కొట్టారు. ఇక్కడ టీచర్‌ను చూడగానే నాకు మొదట ఆ దెబ్బే గుర్తుకు వచ్చింది... పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇంత బలంగా పోరాటం చేయడానికి కారణం

ఇంత బలంగా పోరాటం చేయడానికి కారణం

స్కూలు రోజుల్లో నేను నేర్చుకున్న పాఠాలు, విలువలే నేను ఈ రోజు ఇంత బలంగా పోరాటం చేయడానికి ప్రోద్బలాన్ని ఇచ్చాయి. చిన్న నాటి విషయాలను, స్నేహితులతో గడిపిన రోజులును నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అందుకే సరిగా స్కూలుకు వెళ్లేవాన్ని కాదు

అందుకే సరిగా స్కూలుకు వెళ్లేవాన్ని కాదు

నేను రెగ్యులర్‌గా స్కూలుకు వెళ్లి చదువుకుంది చాలా తక్కువ. నువ్వెందుకు సరిగా స్కూలుకు రావడం లేదంటే నేను అప్పట్లో సరిగా చెప్పలేక పోయేవాడిని. ఆ రోజుల్లో నాకు బ్రాంకౌైటీస్(అస్తమా) ఉండేది. దీంతో రెగ్యులర్‌గా స్కూలుకు వెళ్లే అలవాటు తప్పింది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X