పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. మాతృమూర్తి అంజనాదేవీ పుట్టిన రోజున ఏం చేశారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి అరుదైన తన వ్యక్తిత్వాన్ని చాటుకొన్నారు. జంతు సంరక్షణ కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. వైజాగ్‌లోని జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. జంతు, వన్య సంరక్షణ అధికారులతో కలిసి ఆయన ఆ కేంద్రాన్ని సందర్భించారు. ఆ ప్రాంతంలో సంచరిస్తూ అరుదైన జంతువులపై ప్రేమను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు. పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైజాగ్ జంతు ప్రదర్శన శాలలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన విశేషాల వివరాల్లోకి వెళితే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. జంతు ప్రదర్శన శాలలోని నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్స్‌కు ప్రారంభోత్సవం చేశారు. జూపార్క్‌లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి ఆహారం అందించారు. ఆయా జంతువుల పేర్లను, వివరాలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకొన్నారు.

Pawan Kalyan adopted two giraffes

అలాగే వైజాగ్‌లోని కంబాలకొండ ఎకోపార్క్‌లోని నగర వనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఎకో పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపి వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. వారితో కలిసి జంతు, వన సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిపారు.

పవన్ కల్యాణ్ తన తల్లి అంజనాదేవీ జన్మదినోత్సవం సంద్బరంగా తన మాతృమూర్తిపై ఎనలేని గౌరవాన్ని ప్రేమను చాటుకొన్నారు. మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా జూపార్క్‌లోని రెండు జిరాఫీలను దత్తత తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మా అమ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకొన్నాను. అమ్మ గారి పేరు మీద సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. సంవత్సరానికి రెండు జిరాఫీలకు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తాన్ని అధికారులకు, జూ నిర్వాహకులకు అందజేస్తాను. ప్రతీ ఒక్కరు కూడా తమ బాధ్యతగా జంతు సంరక్షణకు మన వంతు కృషి చేయాలని కోరుతున్నాను అని అన్నారు.

శ్రీమతి అంజనాదేవీ పుట్టిన రోజును కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఘనంగా జరుపుకొన్నారు. తమ తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైజాగ్ పర్యటనలో పవన్ కల్యాణ్ తన తల్లి పేరిట జంతువులను దత్తత తీసుకొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత తీసుకొన్న నిర్ణయంపై అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan anjana devi vizag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X