twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawankalyan : సినిమాలు ఆపుతారా? ఆపుకోండి చూద్దాం.. టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి, కానీ?

    |

    ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల వ్యవహారం అలాగే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సమావేశంలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రేట్లు పెంచమని అడిగింది తన ఒక్కడి కోసమే కాదని పేర్కొన్నారు ఆయన అసలు సినిమా రేట్లు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ కీలక కామెంట్లు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    మీరేమన్నా సంపాదించారా..?

    మీరేమన్నా సంపాదించారా..?

    ప్రజా సమస్యలపై ప్రశ్నించి ప్రతి సన్నాసితో తిట్టించుకోవడం సరదానా..? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ప్రశ్నిస్తానని, నన్ను తిడితే కుంగిపోతారనుకుంటారేమో.. మరింత బలపడతా..? అని అన్నారు. ప్రతి ఒక్కర్నీ గుర్తుంచుకుంటానన్న ఆయన పథకాలకు ఆ అన్న పథకం.. పెద్దన్న పథకం అంటూ పేర్లేంటి..? అని ప్రశ్నించారు. ఎవరి సొమ్మని మీ పేర్లు పెట్టుకుంటున్నారు..? మీరేమన్నా సంపాదించారా..? అని పవన్ ప్రశ్నించారు.

    టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి

    టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి

    ఇక ప్రభుత్వ పథకాల్లో కోతలు విధిస్తే మేం అడగమా..? అని ప్రశ్నించిన పవన్, అడుగుతున్నారని కోడి కత్తి గ్యాంగులతో అరచాకాలు సృష్టిస్తారా..? అని ప్రశ్నించారు. ఇక సినిమా థియేటర్ రేట్ల గురించి అడిగాను అంటే అది తన కోసం కాదని అందరి కోసమని అన్నారు. ఇక నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? అని ప్రశ్నించిన అయన మీ వైసీపీ నేతలకే ఉన్నాయని, కాకినాడ, నెల్లూరుల్లో థియేటర్లు ఎవరివి మీ వారివి కావా..? అని ప్రశ్నించారు.

    టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి

    టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి

    సినిమా టిక్కెట్ రేట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. నాకేం అభ్యంతరం లేదు కానీ తనకు ఒకటే బాధ ఉందని మా కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటీ..? అని ప్రశ్నించారు. ఓ పని చేయండి.. ఇళ్లల్లోకి వచ్చి మా బంగారాన్ని లాగేసుకోండంటూ పవన్ ఎద్దేవా చేశారు. ఇక నాకు మొదటి జీతంగా తన బావ అల్లు అరవింద్ గారు పెద్ద మనసు చేసుకొని నెలకు 5000 ఇచ్చారని అన్నారు పవన్. నేను అడిగేది ఏదంటే ఒకరి కష్టార్జితాన్ని దోచుకునే హక్కులేదని అన్నారు. ఇక అడుగుతున్నదానికి సమాధానం చెప్పే అలవాటు లేదా..? ఎందుకల కుక్కలా అరుస్తున్నారు అంటూ పవన్ విరుచుకుపడ్డారు.

    ఛాలెంజ్‌ విసురుతున్నా

    ఛాలెంజ్‌ విసురుతున్నా

    ఇక ఛాలెంజ్‌ విసురుతున్నా.. దమ్ముతో మాట్లాడుతున్నా.. ఏం చేస్తారో చేసుకోండి.. సినిమాలు ఆపుతారా? ఆపుకోండి.. చూద్దాం.. మీరే మమ్మల్ని యుద్ధానికి పిలిచారు.. మిమ్మల్ని ఎలా కింద కూర్చోబెట్టాలో మాకు తెలుసు అంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఇక తాను సినిమాలను వదిలేయడం పెద్ద విషయం కాదు.. నా కోసం కాదు.. పది మంది కోసం నేను సినిమాలు చేస్తున్నా అని అన్నారు.

    Recommended Video

    Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    అన్నం పెట్టిన తల్లి

    అన్నం పెట్టిన తల్లి

    ఏపీ రాజకీయాల్లో ఓ కులానికి చెందిన నేతను అదే కులం వ్యక్తితో తిట్టిస్తారా..? కాపు కులం వాళ్లతోనే ఎందుకు? అందరితోనూ తిట్టించవచ్చు కదా..? రాష్ట్రమంటే రెండు కులాలు కాదు.. వర్గపోరుతో రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు అని పవన్‌ విమర్శించారు. ఇక సినిమాలంటే నాకు ఇష్టం అని పేర్కొన్న పవన్ నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదని అన్నారు.

    English summary
    Pawan kalyan again responds on andhra pradesh tickets issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X