twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ షూటింగ్‌లో సీఎం బంధువులు బెదిరించారు.. నేను భయపడాలా? అలా చావాలా? పవన్

    |

    అమెరికాలో జరుగుతున్న ప్రవాస గర్జన సభలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బంధువులు బెదిరించారు. అలా అధికారాలను దుర్వినియోగం చేయడం ఇష్టం లేకే రాజకీయ పార్టీని పెట్టాను. కోట్ల రూపాయలు పన్నుకడుతూ ఉన్న నాకు విరాళాలు సేకరించడం ముఖ్యం కాదు అని పవన్ స్పష్టం చేశారు. తనకు ఎదురైన బెదిరింపులపై పవన్ చెప్పినదేమిటంటే..

    అన్నవరం షూటింగ్‌ సందర్భంగా

    అన్నవరం షూటింగ్‌ సందర్భంగా

    అధికారాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చదు. 2007లో అన్నవరం సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అప్పుడు నా రూంలోకి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు వచ్చి కలిశారు. మీరు ఎవరని అడిగితే అప్పటి ముఖ్యమంత్రి బంధువులమని చెప్పారు. ఆ తర్వాత మాకు సినిమా చేసి పెట్టమని అడిగారు. నాకు నచ్చితే నేను చేస్తాను అని మర్యాదగా చెప్పాను.

    నాకు నచ్చకపోవడం

    నాకు నచ్చకపోవడం

    అందుకు వారు మాకు చేయాల్సిందేనని మర్యాదగా అడుగుతూనే నాతో కొంత ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. కానీ వారి మర్యాద వెనుక బెదిరింపులు ఉన్నాయి. అదే నాకు నచ్చలేదు. అందుకే వారితో సినిమా చేయలేదు.

    <strong>రేణు దేశాయ్ ప్రేమ కవిత్వంపై పవన్ ప్రభావం.. 'ఏ లవ్ అన్ కండిషనల్' అంటూ!</strong>రేణు దేశాయ్ ప్రేమ కవిత్వంపై పవన్ ప్రభావం.. 'ఏ లవ్ అన్ కండిషనల్' అంటూ!

    భయపెడితే భయపడే వ్యక్తిని కాదు

    భయపెడితే భయపడే వ్యక్తిని కాదు

    నేను యాక్టర్‌ను కావొచ్చు. నేను మెత్తగా, సున్నితంగా కనిపిస్తానోమో. అయితే భయపెడితే భయపడే వ్యక్తిని కాదు. ప్రేమగా అడిగితే, మర్యాదగా అడిగితే, నాకు కుదిరితే నేను చేస్తాను. కానీ భయపెట్టే విధంగా అడిగితే నేను సహించను. అధికారాన్ని అండగా చేసుకొని వ్యక్తులను ప్రభావితం చేయడం నాకు నచ్చదు.

    రౌడీలు రాజ్యమేలితే

    రౌడీలు రాజ్యమేలితే

    నేను ఎక్కడికైనా వెళితే లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లినా నాకు ప్రజాదరణ ఉంది. అలాంటి నన్ను భయపెట్టడం నాకు ఇష్టం ఉండదు. రౌడీలు రాజ్యం ఏలే స్థాయి ఉన్నప్పుడు మనమెందుకు మౌనంగా ఉండాలి. మహాత్మగాంధీ, అంబేద్కర్ లాంటి మహనీయులు చేసిన త్యాగాలు అందుకేనా అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

     అలా నేను చనిపోలేను

    అలా నేను చనిపోలేను

    నా జీవితంలో ఇలాంటి సంఘటనలు నన్ను బాగా మార్చిపడేశాయి. నేను కెరీర్‌లో హిట్లు సాధిస్తూ 20 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎదురైన పరిస్థితులు నన్ను మార్చేశాయి. అందరిలానే ఇంటికి పరిమితమై.. పిలల్ని కని జీవితాన్ని ముగించలేను. చివరికి ఏదో వృద్దాప్య ఆశ్రమంలో చనిపోలేను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

    అందుకే జనసేన పార్టీ పెట్టాను

    అందుకే జనసేన పార్టీ పెట్టాను

    విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం నాకు ఇష్టం లేకే జనసేన పార్టీని పెట్టాను. ఇప్పటికీ నేను సినిమా చేస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది. దాంతో నాకు సంతృప్తి లభించదు. నా జీవితంలో గొప్ప మార్పు సంభవించిందంటే అది జనసేన పార్టీ పెట్టడమే. మరో 25 ఏళ్లపాటు దేశానికి సేవ చేయడానికి కంకణం కట్టుకొన్నాను.

    విరాళాల కోసం రాలేదు

    విరాళాల కోసం రాలేదు

    నేను సినిమాల్లో నటిస్తే నా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాను. నా సినిమాలు ఆడినప్పుడు నాకు డబ్బులు రాలేదు. నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు రెమ్యునరేషన్ పెరిగింది. డల్లాస్‌కు వచ్చానంటే విరాళాల కోసం రాలేదు. నాకు ఆత్మ గౌరవం ఉంది. ఇతరుల డబ్బు కోసం కక్కుర్తి పడను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

    English summary
    Janasena Pravasa Garjana event started with high note. Pawan Kalyan announces a Doctor’s Wing for Jana Sena Party. Pawan Kalyan speech started amidst thunderous response from janasainiks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X