Acharya ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎందుకు రాలేదంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన మొట్టమొదటి యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా ఈ వేడుకకు ఆహ్వానించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ప్లాన్స్ మారిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ రిలీజ్
సైరా సినిమా తర్వాత చాలా గ్యాప్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న యాక్షన్ మూవీ ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈసినిమా ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

ధర్మస్థలి హైలెట్..
ధర్మం కోసం పోరాడే ఇద్దరు హీరోలు వారి ప్రయాణంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుంటారు. ఎలా కలిసి పోరాడారు అనే అంశాలు ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయని దర్శకుడు కొరటాల శివ ఇదివరకే వివరణ ఇచ్చారు. ధర్మస్థలి అనే ప్రాంతం ఈ సినిమాకు చాలా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ తేజ్ దాదాపు 40 నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు సమాచారం.

పవన్, మహేష్..?
ఇక ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. అయితే రిలీజ్ వేడుకకు దర్శకుడు రాజమౌళి మాత్రమే ప్రత్యేక అతిథిగా వచ్చారు. కానీ ఇంతకుముందు చిత్ర యూనిట్ సభ్యులు ఇద్దరు స్టార్ హీరోలను కూడా ప్రత్యేకత గెస్ట్ లుగా పిలవాలని అనుకున్నారట. ఆ లిస్టులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.

రైతుల కోసం బిజీగా..
పవన్ కళ్యాణ్ ను ప్రత్యేక అతిథిగా పిలవాలి అని రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదట ఆలోచించారు. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా విరాళాలు అందిస్తున్నారు. అనుకోకుండా బిజీ కావడం వల్లనే పవన్ కళ్యాణ్ ఆచార్య ఈవెంట్ కు అందుబాటులో లేక పోయినట్లుగా తెలుస్తోంది.

మహేష్ ఎందుకు రాలేదంటే?
మొదట పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడు అని తెలుసుకున్న ఆచార్య చిత్రయూనిట్ ఆ తర్వాత మహేష్ బాబు ను డైరెక్టర్ రాజమౌళి కూడా పిలవాలి అని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మహేష్ బాబుకు మంచి అనుబంధముంది. అలాగే రామ్ చరణ్ కూడా మంచి స్నేహితుడు అనే సాన్నిహిత్యం తోనే మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఇదివరకే కొరటాల శివతో రెండు బాక్సాఫీస్ అందుకున్నాడు కాబట్టి తప్పకుండా వస్తాడు అని అనుకున్నారు. అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నాడనీ అందుకే హాజరు కాలేక పోయినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











