అలా జరిగితే పవన్ కళ్యాణ్, మహేష్ మధ్యలో బాక్సాఫీస్ పోటీ.. ఇక బీభత్సమే!

బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటే మాత్రం ఇండస్ట్రీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఊహించని స్థాయిలో హడావిడి చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది అగ్ర హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలా జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వేడి మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు. ఆ వివరాలలోకి వెళితే..

మహేష్ vs పవన్

మహేష్ vs పవన్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫెస్టివల్ అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పెద్ద సినిమా ఏదో ఒకటి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు కూడా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏడాది కూడా పండగ సమయంలో పోటీ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు క్లాష్ అయ్యేలా ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

మహేష్ బాబు 28వ సినిమా

మహేష్ బాబు 28వ సినిమా

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరా సమయంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మొదట ఆగస్టులో అనుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కొంత ఆలస్యం అవుతుంది అని అలాగే దసరా అయితే హాలిడేస్ ఉంటాయి కాబట్టి అప్పుడు విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ పాన్ ఇండియా

పవన్ పాన్ ఇండియా

మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా అదే సమయంలో రావచ్చు అనే విధంగా కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తెరపైకి రాబోతోంది. అయితే ఇంతవరకు మాత్రం ప్రమోషన్స్ అయితే పెద్దగా స్టార్ట్ చేసింది లేదు.

 ఆ నమ్మకంతో..

ఆ నమ్మకంతో..


అయినప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక తప్పకుండా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో 2023 దసరా సమయంలో విడుదల చేయాలని చూస్తున్నారు.

 ఇద్దరు ఒకేసారి వస్తే..

ఇద్దరు ఒకేసారి వస్తే..

ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి క్లాష్ అయిన సందర్భాలు ఎక్కువగా లేవు. ఇక ఇప్పుడు మాత్రం వారి రేంజ్ మామూలుగా లేదు. ఇద్దరికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి డిమాండ్ అయితే ఉంది. కాబట్టి ఇద్దరూ పోటీ పడితే మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది ఇక వీరి మధ్యలో చిన్న సినిమాలు రావడానికి కూడా వెనుకడుగు వేస్తాయి. మరి ఈ క్లాష్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X