పవన్ బాటలోనే మరో మెగా హీరో.. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు

లాక్ డౌన్ తరువాత సినిమాలు రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్ హిట్ అవ్వడం అన్ని చాలా వేగంగా జరిగిపోయాయి. ఒక విధంగా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ వచ్చింది. ఇక హీరోలు కూడా చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ క్రమంలో మెగా హీరోలు మరింత స్పీడ్ పెంచారు. ఇక ఈ ఏడాదిలో కొందరు రెండేసి సినిమాలను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా ఈ సమ్మర్ కు రాబోతోంది. నిర్మాత దిల్ రాజు ఏప్రిల్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను సమ్మర్ అనంతరం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు.

Pawan kalyan and sai dharam tej back to back movies

దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్న సాయి ఆ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయాన శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీని ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్ 24న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందట. సాయి గత రెండు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X