సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం: మెగా మల్టీస్టారరే చివరిది.. మేనల్లుడి కోసమే 20 రోజులు!
టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను, భారీ ఫాలోయింగ్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పవన్ మరో రీమేక్ మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక, తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరుగుతోంది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

భీమ్లా నాయక్‌గా వచ్చిన పవన్
పవన్ కల్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో వచ్చాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేశాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంది.

తొలిసారి పిరియాడిక్ మూవీలో
పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ బ్యాలెన్స్ ఉండిపోయింది.

భగత్ సింగ్‌లా మారుతున్నాడు
'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే, ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

మళ్లీ రీమేక్.. మల్టీస్టారర్ మూవీ
ఇప్పటికే చాలా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నాడు. సముద్రఖని తెరకెక్కించబోయే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

జూలై నుంచే సినిమా మొదలు
'వినోదయ సీతమ్' మూవీ మెగా మల్టీస్టారర్‌గా రూపొందనుందని తెలిసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఇది ఎప్పుడు మొదలు కాబోతుందో మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జూలై మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నారట. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తారట.
ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్
https://telugu.filmibeat.com/television/hyper-aadi-comments-creates-controversy-in-dhee-show-110357.html

20 రోజులు.. ఇదే చివరి సినిమా
విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'వినోదయ సీతమ్' రీమేక్ కోసం పవన్ కల్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించాడట. అంతేకాదు, దీని తర్వాత ఈ స్టార్ సినిమా సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడం కోసమే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అంటే ప్రస్తుతానికి ఇదే అతడికి ఆఖరు సినిమా కాబోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











