పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీపై మరో ఆసక్తికరమైన అప్డేట్.. జెట్ స్పీడ్ ప్లాన్ రెడీ!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు ప్రజాసేవలో మరొకవైపు సినీ జీవితంలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. నిమిషం కూడా తీరిక లేకుండా ఇటీవల పలు రాజకీయ అంశాలతో చాలా బిజీ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ మధ్య క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అసలైయితే ఆ షెడ్యూల్ ను పవన్ కళ్యాణ్ ఎలాంటి గ్యాప్ లేకుండా ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే పలు రైతుల సమస్యలు తన దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా బిజీగా మారిపోయాడు. అంతేకాకుండా చాలా మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా ప్రజాసేవలోనే పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. నిర్మాతలకు మాట ఇచ్చాడు కాబట్టి షూటింగ్స్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక హరిహర వీరన్న సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ మరొక సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్రివిక్రమ్ సలహా మేరకు పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ నటుడు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తమిళ్ మూవీ వినోదయ సీత్తం రీమేక్ లో నటించబోతున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఆ సినిమాలో మరొక హీరోగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో సముద్రఖని త్రివిక్రమ్ సలహా మేరకు రెడీ చేసుకుంటున్నాడు. తెలుగు డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు పెట్టాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మే చివరలో సినిమాను అఫీషియల్ లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వివేక్ నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులను కేవలం మూడు నెలలలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కుదిరితే రెండు నెలల సమయం లోనే ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల డేట్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను ఎలాంటి గ్యాప్ లేకుండా ఫీల్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ కూడా పూర్తి కథను వినిపించినట్లు తెలుస్తోంది. అతను ఈ సినిమా కోసం లుక్ ను కొంత చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ మెగా మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











