ఆ రికార్డును అందుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్s అయితే వస్తూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా అతనికి ఫాన్ ఫాలోవర్స్ మరింత పెరిగారు. ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా సామాజిక అంశాల గురించి స్పందిస్తూ ఉంటారు. ఏనాడు కూడా సినిమాల గురించి ఆయన పెద్ద స్పందించింది లేదు.
అలాగే తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చేసింది లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సామాజిక అంశాల పైన దృష్టి సాదించే హీరో. ఇక ట్విట్టర్లో ఇప్పటికే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టాడు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో ఫాలోవర్స్ పెరుగుతూ ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లోకి వస్తున్నారు అని తెలియగానే ఫాలోవర్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే పవన్ కళ్యాణ్ కు అత్యధిక వేగంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు మరింత పెరిగింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను కూడా సాధించడం విశేషం.
సాధారణంగా ఏ సెలబ్రెటీ అయిన సరే ఏదో ఒక పోస్ట్ చేసి ఇన్స్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అయినా కూడా ఊహించని స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఈ విధంగా అరుదైన రికార్డును అందుకున్న ఏకైక హీరోగా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











