మలయాళ రీమేక్ లో పవన్ కళ్యాణ్.. అభిమానితో పవర్ స్టార్ ఫైట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యువతలో క్రేజ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా పవర్ స్టార్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విషయం బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా తెలుసు. చాలా మంది పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ చూసే ఆయనను ఇష్టపడ్డారు. అయితే కలలో కూడా ఊహించని విదంగా పవర్ స్టార్ vs ఫ్యాన్ అనే మాట ఇప్పుడు వైరల్ అవుతోంది.

చెరగని ప్రేమ..

చెరగని ప్రేమ..

పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా తన వ్యక్తిత్వంతోనే జనాల హృదయాలను ఎక్కువగా గెలుచుకున్నాడు. సాధారణంగా ఒక హీరో సినిమా డిజాస్టర్ అయితే నెక్స్ట్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ పవర్ స్టార్ సినిమాలకు మాత్రం కొంచెం కూడా ఆ బజ్ తగ్గలేదు. ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉంది.

స్ట్రాంగ్ సెకండ్ ఇన్నింగ్స్..

స్ట్రాంగ్ సెకండ్ ఇన్నింగ్స్..

సినిమాలకు పెద్దగా గ్యాప్ ఇవ్వకపోయినా కూడా రాజకీయాలతో బిజీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుండడంతో ఆయనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ సినిమాలతో మంచి సందేశాల్ని అందించి హిట్టు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్ లో లెట్టాలని చూస్తున్నాడు.

మలయాళం రీమేక్..

మలయాళం రీమేక్..

మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాను తెలుగులో నిర్మించడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ముందుగా ఆయన పవన్ కళ్యాణ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకసారి సినిమా చూడాలని కోరినట్లు సమాచారం. క్రిష్ ప్రాజెక్టు అనంతరం హరీష్ శంకర్ సినిమాతో పాటు మరో సినిమాను తక్కువ సమయంలో ఫినిష్ చేయాలి అంటే ఇలాంటి కాన్సెప్ట్ బావుంటుందని పవన్ కి సన్నిహితులు కూడా చెప్పారట.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
అభిమానితో వార్..

అభిమానితో వార్..

డ్రైవింగ్ లైసెన్స్ అనే కథలో పృథ్వి రాజ్ హీరోగా నటించాడు. ఒక అభిమానికి స్టార్ హీరోకి జరిగే యుద్ధమే ఈ సినిమా కధ. ఆర్టీవోకి చెందిన ఓక అధికారి తన అభిమాన హీరోను ఒక వివాదంలో ఎలా ఎదుర్కొన్నాడు అనే విదంగా ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు సెట్టవుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. మంచి దర్శకుడు సెట్టయితే గనక సినిమా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి పవన్ ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X