వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో బయటపడిన పవర్ స్టార్ న్యూ లుక్.. స్టన్ అయ్యేలా స్టైలిష్ లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టార్(ఓజీ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో సిద్ధం అవుతోన్న ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉంటుందని టాక్.
ఇదిలా ఉంటే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హోటల్ లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా షూటింగ్ ముగించుకొని నేరుగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.

క్యాజువల్ జీన్స్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కంప్లీట్ న్యూ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. ఓజీ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ సినిమాని గ్యాప్ లేకుండా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారనే సంగతి తెలిసిందే. జూన్ 14 నుంచి ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర మొదలు కాబోతుంది.
ఈ లోపు మరో షెడ్యూల్ ని ఫినిష్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లో ఓ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్. సుజిత్ ప్పటివరకు ఓజీకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకి రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ లోనే ఓజీ సినిమాలో కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఈవెంట్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లవర్ బొకేతో విషెస్ చెప్పారు. అలాగే ఫ్యామిలీ మొత్తం కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలని పవర్ స్టార్ ఫ్యాన్స్ గ్రూపులలో షేర్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











