Just In
- 11 min ago
కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్
- 28 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 58 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
Don't Miss!
- News
extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు: లేటుగా ప్రకటించినా అదే ముందు
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడాయన. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా రూపొందుతోందీ మూవీ. ఇది షూటింగ్ పూర్తవక ముందే మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టేశాడు పవన్. వీటిలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంతో పాటు హరీశ్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. అలాగే మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ కూడా చేస్తున్నారు.
'వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్.. క్రిష్‌తోనే సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్‌లోకి వచ్చింది. సాగర్ కే చంద్ర తెరకెక్కించనున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఇప్పటికే రవితేజ, గోపీచంద్, నితిన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో దగ్గబాటి రానానే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు.

ప్రస్తుతం 'వకీల్ సాబ్' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. హైదరాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ను డిసెంబర్ 21 అనగా సోమవారం అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. జనవరి మొదటి వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతుందని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.