వకీల్ సాబ్‌కు పవన్ కల్యాణ్ డబ్బింగ్.. డైలాగ్స్‌తో మెరుపులు.. వైరల్‌గా ఫోటోలు
బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు ముస్తాబుతున్నది. ఇప్పటికే ప్రచార జోరును సాగిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు సంబంధించిన వర్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

హిందీ, తమిళ భాషల్లో
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన పింక్ చిత్రం తమిళ భాషలో కూడా మంచి విజయాలను అందుకొన్నది. తాజాగా తెలుగులో బోని కపూర్, దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

గతేడాది ఏప్రిల్‌లోనే విడుదల
వాస్తవానికి వకీల్ సాబ్ చిత్రం గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని భావించారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా కొంత షూటింగ్ వాయిదా పడటం, మరికొంతగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ మరింత వాయిదా పడింది.

పింక్ కథను సమూలంగా మార్చేసి
తెలుగులో పింక్ చిత్ర కథను సమూలంగా మార్చి పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించారనే విషయాన్ని తాజా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడిస్తున్నారు. కథలో అనూహ్యమైన మార్పులు చేయడంతో సెకండాఫ్‌లో ఆశ్చర్యానికి గురిచేసే అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయనే భరోసాను దర్శకుడు వేణు శ్రీరాం, సంగీత దర్శకుడు ఎస్ థమన్ పేర్కొన్నారు.

డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కల్యాణ్
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను చెప్పేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్‌లో వచ్చారు. ఆయన డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. డబ్బింగ్ చెబుతున్నప్పుడు పవన్ చాలా భావోద్వేగంగా కనిపించారు. తెల్లటి దుస్తుల్లో పవన్ కల్యాణ్ ఆకట్టుకొనే విధంగా కనిపించారు.

ఎమోషనల్‌గా డైలాగ్స్
వకీల్ సాబ్‌లో భావోద్వేగమైన పాత్రలో కనిపిస్తున్న పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్పే సమయంలో చాలా ఎమోషనల్‌గా మారిపోయారని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. తన రోల్ కోసం డైలాగ్స్ చెబుతూ మెరుపులు మెరించారని చెప్పారు. పాత్రకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కరెక్షన్ ఉన్నా సాంకేతిక నిపుణులను స్వయంగా అడిగి తెలుసుకొని దానిని కరెక్ట్ చేశాడు అని వివరించారు.

చిత్ర యూనిట్‌తో సన్నిహితంగా ఫోటోలు
వకీల్ సాబ్ డబ్బింగ్ పనులు పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ చిత్ర యూనిట్‌తో పవన్ కల్యాణ్ ఫోటోలు దిగారు. సాంకేతిక నిపుణులతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ వారిని ఆకట్టుకొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకొన్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: పవన్ కల్యాణ్, శృతిహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, నరేష్, ముఖేష్ రుషి, దేవ్ గిల్, సుబ్బరాజు, వంశీ కృష్ణ, అనసూయ భరద్వాజ్, ఆనంద చక్రపాణి తదితరులు
రచన, దర్శకత్వం: వేణు శ్రీరాం
నిర్మాత: దిల్ రాజు, బోనికపూర్
మ్యూజిక్: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: పీఎస్ వినోద్
ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బోనికపూర్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2021-04-09


Click it and Unblock the Notifications











