Bhavadeeyudu Bhagat Singh: సస్పెన్స్ కు తెరదించబోతున్న డైరెక్టర్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలను కూడా చాలా తొందరగానే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక రకాల సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ వీలైనంతవరకు రైతులకు కూడా అండగా నిలిచినందుకు సహాయం చేస్తున్నాడు. ఇటీవల కౌలు రైతుల ఆత్మహత్యల విషయంపై ప్రత్యేకంగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ చాలా మంది ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలను అనుకున్న సమయానికి కూడా పూర్తి చేయలేకపోతున్నాడు ప్రస్తుతం పెండింగ్లో చాలా ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అయితే అందులో మరికొన్ని ఆగిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ భవదియుడు భగత్ సింగ్ సినిమాను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

Pawan kalyan Bhavadeeyudu Bhagat Singh latest update on director meeting

అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ అప్డేట్ అయితే ఇస్తూ వచ్చాడు. ఇక ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ ఎక్కువ రావడంతో మళ్లీ కొన్ని వార్తలు అభిమానుల్లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ రెండు మూడు రోజుల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడి అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కలయికలు మరో సినిమా చూడాలి అని ప్రేక్షకులు ఎంతో ఆదర్శంగా ఎదురుచూస్తున్నారు. మరి హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఇలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా వినోదాయ సీతం రీమేక్ సినిమాను స్టార్ట్ చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X