Pawan Kalyan: ఇంతవరకు మీరు చూడని.. భీమ్లా నాయక్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనంతరం భీమ్లా నాయక్ సినిమాను చాలా వేగంగా ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ సినిమా షూటింగ్ కు చాలా చాలా సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు ఇతర సినిమాల నుంచి విడుదల తేది పై చర్చలు జరగడం తో సినిమా మొత్తానికి సంక్రాంతి నుంచి వైదొలిగింది.. అయితే సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండు సార్లు వాయిదా..
అజ్ఞాతవాసి సినిమా తరువాత చాలా కాలం పాటు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు.. పవర్ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఆ సినిమాతో చాలా క్లియర్ గా అర్థమైంది. ఇక భీమ్లా నాయక్ సినిమాను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ సినిమాను రెండు సార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

సంక్రాంతికి భీమ్లా వచ్చి ఉంటే..
అసలైతే ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ RRR చిత్ర యూనిట్ సభ్యులు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాను వాయిదా వేసుకునేలా చేశారు. చివరికి ఆ సినిమా కూడా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా వచ్చి ఉంటే మాత్రం వాతావరణం మరోలా ఉండేది అని చెప్పవచ్చు.

హై వోల్టేజ్ మల్టీస్టారర్
మలయాళం బాక్సాఫీస్ హిట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా రాబోతున్న భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు పవర్ ఫుల్ పాత్రలో రానా నటించిన విషయం తెలిసిందే.. ఇద్దరు కూడా పోటా పోటీగా బాహుబలి లాంటి వాతావరణం క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. తప్పకుండా సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని ఫస్ట్ లుక్ టీజర్ చూస్తేనే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

భీమ్లా ఫ్యామిలీ ఫొటో
ప్రస్తుత భీమ్లా నాయక్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల్లో భీమ్లా నాయక్ కు భార్యగా నిత్య మీనన్ నటించిన విషయం తెలిసిందే. అయితే వీరికి ఓ చిన్న కుమారుడు కూడా ఉన్నట్లు సినిమాలో చూపించనున్నారు. ఇక వీరి సింపుల్ ఫ్యామిలీ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంతవరకు ఇలాంటి ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేయలేదు.

మళ్ళీ ఎప్పుడంటే..?
సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వాహిస్తుండగా త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. జనవరి 13న రవాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25కి వాయిదా పడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











