పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే అద్భుతమైన రీతిలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను అందుకుని హవాను చూపించాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానాన్ని సైతం అందుకున్నాడు. మధ్యలో కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు.

ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీతో తాజాగా ఈ స్టార్ హీరో ఆల్ ఇండియా రికార్డును క్రియేట్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుసగా ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తున్న 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆ కథతో వస్తోంది... ఇద్దరి పాత్రలు ఇలా

ఆ కథతో వస్తోంది... ఇద్దరి పాత్రలు ఇలా

ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో 'అయ్యప్పనుమ్ కోషియం' తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి 'భీమ్లా నాయక్'గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

‘భీమ్లా నాయక్' వీడియో అదిరిందిగా

‘భీమ్లా నాయక్' వీడియో అదిరిందిగా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియో పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ మేనరిజం.. మాస్ అవతార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనికితోడు ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి మరింత వన్నెను తీసుకుని వచ్చిందని చెప్పుకోవచ్చు.

పవన్ దెబ్బకు అల్లాడిపోయిన రికార్డులు

పవన్ దెబ్బకు అల్లాడిపోయిన రికార్డులు

దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన మాస్ రోల్స్ చాలా తక్కువనే చెప్పాలి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్స్‌ను ఏర్పరచుకున్న ఈ స్టార్ హీరో.. పూర్తి మాస్ లుక్‌లో ఎక్కువగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా లుంగీ కట్టుకుని ఊరమాస్ గెటప్‌తో కనిపించడంతో 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు ఇలా ఎన్నో లైకులు, వ్యూస్‌ను సంపాదించింది. తద్వారా టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు అల్లల్లాడిపోయాయి.

అందులో ‘భీమ్లా నాయక్' హవా చూపి

అందులో ‘భీమ్లా నాయక్' హవా చూపి

'భీమ్లా నాయక్' గ్లిమ్స్ వీడియోకు ఆరంభం నుంచి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఫలితంగా 24 గంటల్లోనే దీనికి 8.49 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా టాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన గ్లిమ్స్ వీడియోగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీనికితోడు 728.6K లైకులు వచ్చాయి. ఫలితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ వీడియో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా లైకులు, వ్యూస్‌లో హవాను చూపించినట్లైంది. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలోనే ఈ గ్లిమ్స్ వీడియో పది, ఇరవై మిలియన్ల వ్యూస్‌ను కూడా సొంతం చేసుకుంది.

సాంగ్‌కు కూడా భారీగా... రికార్డులు బ్రేక్

సాంగ్‌కు కూడా భారీగా... రికార్డులు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్'పై ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భాగంగానే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా ఈ లిరికల్ సాంగ్ ఇప్పటికే 26 మిలియన్ వ్యూస్.. 1.10 మిలియన్ లైకులను రాబట్టింది. ఫలితంగా ఇది కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
పవన్ కల్యాణ్ ఆలిండియా రికార్డు కొట్టి

పవన్ కల్యాణ్ ఆలిండియా రికార్డు కొట్టి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాతాలో తాజాగా ఆల్ ఇండియా రికార్డు వచ్చి చేరింది. దీనికి కారణం అతడు నటించిన 'భీమ్లా నాయక్' మూవీ గ్లిమ్స్ వీడియో ఒక మిలియన్ లైకులను సొంతం చేసుకోవడమే. తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ ఇప్పటి వరకూ ఓ గ్లిమ్స్ వీడియో కూడా ఒక మిలియన్ లైకులను అందుకోలేదు. దీంతో పవన్ కల్యాణ్ పేరిట ఈ అరుదైన రికార్డు నమోదైంది. ఇక, 'భీమ్లా నాయక్' గ్లిమ్స్ వీడియో ఇప్పటికే 20 మిలియన్ వ్యూస్.. ఒక మిలియన్ లైకులను సొంతం చేసుకుంది. ఇప్పటికి ఈ మూవీ నుంచి రెండు వీడియోలు రాగా, రెండూ 20 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైకులు దాటిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X