పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: అరుదైన ఘనతను అందుకున్న ‘భీమ్లా నాయక్’

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్వింగ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో కమ్‌బ్యాక్ అయిన అతడు.. దీనితో భారీ విజయాన్ని అందుకున్నాడు. అదే సమయంలో ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించేశాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. సాగర్ కే చంద్ర దీన్ని తెరకెక్కిస్తున్నాడు. మలయాళంలో 'అయ్యప్పనుమ్ కోషియం' అనే పేరుతో వచ్చి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకే అది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

'అయ్యప్పనుమ్ కోషియం' మూవీ ఆధిపత్యం కోసం ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్' అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని 'భీమ్లా నాయక్' యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. శ్రీకృష్ణ పృథ్వీ చంద్ర, రామ్ మిరియాలతో కలిసి థమన్ స్వయంగా ఆలపించాడు. ఆరంభంలో భీమ్లా నాయక్ చరిత్రను చెబుతూ దర్శనం మొగలయ్య బుర్రకథలా చెప్పాడు. దీంతో ఈ పాటకు పవర్ స్టార్ అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇది సూపర్ హిట్ అయింది.

Pawan Kalyan Bheemla Nayak Title Song Reach 40 Million Views

భారీ అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్‌కు అంతే స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, భారీగా వ్యూస్, లైకులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఒక మిలియన్ లైకులను సొంతం చేసుకున్న ఈ పాట.. తాజాగా 40 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. తద్వారా వేగంగా ఇన్ని వ్యూస్‌ను అందుకున్న పాటల జాబితాలోకి చేరిపోయింది. దీంతో పవర్ స్టార్ పేరిట మరో రికార్డు వచ్చి చేరింది.

మల్టీస్టారర్‌ జోనర్‌లో రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్‌తో పాటు మరో భామ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X