twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR పుష్ప మేకర్స్ ను కలిపేస్తున్న పవన్ కళ్యాణ్.. బిగ్ ప్లాన్?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ అంశాలతో ఈ మధ్యకాలంలో పవన్ మరింత బిజీగా మారిపోవడం వలన కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేయలేక పోతున్నాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం నిర్మాతలకు సినిమా చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మరొక పెద్ద ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

    భీమ్లా నాయక్ సినిమా తర్వాత వెంటనే మరొక సినిమా కూడా పూర్తి చేయాలి అని పవర్ స్టార్ అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడడం లేదు. ఇటీవల వరుస పర్యటనలతో పవన్ కళ్యాణ్ కాస్త అనారోగ్యానికి కూడా గురయ్యారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో రాజకీయాలకు సంబంధించిన చాలా మీటింగ్స్ నిర్వహించాల్సి ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటిక్స్ లో గెలిచి తీరాలి అనే పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగా కొనసాగుతున్నారు. అంతే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు.

    Pawan kalyan big plan with RRR and pushpa movie makers

    ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు నిర్మాతలతో ఒకేసారి సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలి అని హరిశంకర్ ద్వారా కథ కూడా విన్నారు. ఆ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. అయితే ఈ క్రమంలో పవన్ బిజీగా ఉండడం వలన ఆ ప్రాజెక్టును తొందరగా మొదలుపెట్టలేకపోతున్నాడు.

    అలాగే మరోవైపు RRR నిర్మాత DVV దానయ్యతో కూడా ఒక సినిమా చేయాలని ఒప్పుకున్నారు. అప్పట్లో సాహో డైరెక్టర్ సుజిత్ కూడా కథ రెడీ చేస్తున్నట్లుగా కథనాలు అయితే విలువడ్డాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ పుష్ప RRR నిర్మాతలతో కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే హరీష్ శంకర్ సినిమా చేస్తాడా లేకపోతే సుజిత్ తో చేస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇక త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Pawan kalyan big plan with RRR and pushpa movie makers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X