పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ఇక పండగే పండుగ: ఎవరూ ఊహించని గిఫ్ట్ రెడీ అవుతోంది!

By Manoj Kumar P

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెలుగులోకి వచ్చిన ఆయన... అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో మందికి వెలుగునిచ్చే స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో కొలువుదీరాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డులను ఆయన ఫ్యాన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వాళ్లలో ఖషీని నింపే న్యూస్ ఒకటి లీకైంది. సాధ్యం కాదు అనుకున్నది రెడీ అవుతోంది. ఇంతకీ ఏంటది.? వివరాల్లోకి వెళ్తే...

పాత కథతోనే పవన్ కల్యాణ్ కొత్త ప్రయోగం

పాత కథతోనే పవన్ కల్యాణ్ కొత్త ప్రయోగం

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం అనంతరం ఆయన ‘వకీల్ సాబ్' అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నివేదా, అంజలి, అనన్య హీరోయిన్లు.

రీఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారుగా

రీఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారుగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో... వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్‌గా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండే ఈ పాత్రను హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ పోషించారు. అయితే, ఆ రెండు భాషల్లో లేని విధంగా తెలుగులో హీరో రోల్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రెండు వచ్చాయి.. రికార్డులు బద్దలయ్యాయి

రెండు వచ్చాయి.. రికార్డులు బద్దలయ్యాయి

‘వకీల్ సాబ్' మూవీ పవన్ కెరీర్‌లో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో వచ్చిన గ్యాప్‌ను ఈ మూవీతో మరిపించాలని ఆయన భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇది రూపొందుతోంది. ఇదిలాఉండగా, ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ‘మగువా మగువా' అంటూ సాగే పాటకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా రికార్డులు బదలయ్యాయి.

 అప్పుడే రావాల్సింది... ఇంకెప్పుడొస్తుందో

అప్పుడే రావాల్సింది... ఇంకెప్పుడొస్తుందో

వాస్తవానికి పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ మూవీగా వస్తున్న ‘వకీల్ సాబ్'... సమ్మర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. మే 15న దీన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది కూడా. అయితే, కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో షూటింగులు కష్టం కావడంతో సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావడం లేదు.

పవన్ ఫ్యాన్స్‌ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు

పవన్ ఫ్యాన్స్‌ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు

సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ‘వకీల్ సాబ్' సినిమా నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పటికీ షూటింగ్ రీ స్టార్ట్ కాకపోవడంతో అది వచ్చే అవకాశాలు లేవన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎవరూ ఊహించని గిఫ్ట్ రెడీ అవుతోంది.!

ఎవరూ ఊహించని గిఫ్ట్ రెడీ అవుతోంది.!

తాజా సమాచారం ప్రకారం... షూటింగ్ జరగకపోయినప్పటికీ.... గతంలో చిత్రీకరించిన భాగం నుంచి ‘వకీల్ సాబ్' టీజర్‌ను కట్ చేయాలని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పనులను కూడా ఇప్పటికే మొదలెట్టేశారని తెలిసింది. దీన్ని పవన్ పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందుగానే వదలబోతున్నారని సమాచారం.

ఆ ఇద్దరు డైరెక్టర్లు ఏం చేయబోతున్నారు?

ఆ ఇద్దరు డైరెక్టర్లు ఏం చేయబోతున్నారు?

‘వకీల్ సాబ్' మూవీ పట్టాలపై ఉండగానే పవన్ కల్యాణ్... మరో రెండు సినిమాలకు పచ్చ జెండా ఊపేశాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి రూపొందించే పిరియాడిక్ మూవీ కాగా, రెండోది హరీశ్ శంకర్ తీస్తున్నాడు. ఇది పూర్తి కమర్షియల్ జోనర్‌లో రాబోతుంది. ఇదిలాఉండగా... ఈ ఇద్దరు డైరెక్టర్ పవన్ పుట్టినరోజున ఏ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X