twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్లో ఖరీదైన ఆస్తి దక్కించుకున్న పవన్ కళ్యాణ్.. ప్రైం ఏరియాలో స్థలం కొనుగోలు.. ఎన్ని కోట్లంటే?

    |

    టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది హైద్రాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఓ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు మరో చోటు ఒక ఖరీదైన భూమి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఆఫీస్‌ను కూడా

    ఆఫీస్‌ను కూడా

    ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ వరుసగా మూవీస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్న ఆయన మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా చేస్తూ రెండింటినీ మేనేజ్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్‌లో సొంత ఇల్లు, పెద్ద ఫామ్‌హౌస్‌ ఉన్నాయి. ఇటీవల తన ఇంటికి సమీపంలోనే ఓ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ఆయన ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు.

     ఖరీదైన ప్రాంతంలో

    ఖరీదైన ప్రాంతంలో

    వీటికి తోడు ఆయన తాజాగా హైదరాబాద్‌లోని ఒక ప్రైమ్ ఏరియాలో 1200 చదరపు గజాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో చదరపు గజానికి రూ.2 లక్షల దాకా ఖరీదు ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి, ఆ ప్లాట్ ధర రూ. 24 కోట్ల కంటే తక్కువ ఉండే అవకాశం లేదు. ఆ ప్రాంతం ఖాజాగూడ కాగా ఇప్పుడు సిటీలో ఆ ఏరియా కొత్తగా అభివృద్ధి అవుతోంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు అలాగే గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి.

    పెట్టుబడి పెడుతున్నట్టు

    పెట్టుబడి పెడుతున్నట్టు

    అలాంటి ఏరియాలో ఆయన ఓ ప్రముఖ స్కూల్ ఎదురుగా ఈ ప్లాట్‌ని సొంతం చేసుకున్నారు. ఒకరకంగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. వరుస సినిమాలకు అడ్వాన్స్‌లు తీసుకుంటున్న ఆయన వాటిని ఇలా పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలు ఒప్పుకున్నాడు.

    వరుస సినిమాలతో

    వరుస సినిమాలతో

    భీమ్లా నాయక్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా అనూహ్య పరిస్థితుల్లో సినిమాను ఫిబ్రవరి 25న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఆ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అలాగే బండ్ల గణేష్ తో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో మరో సినిమా కూడా పవన్ చేయడానికి ఒప్పుకున్నారు.

    భీమ్లా నాయక్ డిజిటల్ రిలీజ్

    భీమ్లా నాయక్ డిజిటల్ రిలీజ్

    ఇక పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భీమ్లా నాయక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మార్చి చివరి వారంలో తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. అందుతున్న సమాచారం మేరకు ఈ నెల చివరి శుక్రవారం ఆహాలో అలాగే డిస్నీ +హాట్ స్టార్లొ ఏకకాలంలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.

    English summary
    Pawan Kalyan Bought a plot with a huge rate In Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X