BRO: పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ కు ప్లాన్ రెడీ.. వచ్చేది ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో సిద్ధమైన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతమ్ రీమేక్ గానే ఈ మూవీ రాబోతోంది. అయితే స్క్రీన్ ప్లే, పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మార్పులు చేశారు. క్యారెక్టరైజేషన్స్ లో మార్పులు చేశారు. ఇక ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది.
ఇప్పటికే బ్రో సినిమా డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తేజ్ కి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తనికెళ్ళ భరణి కూడా బ్రో చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా నుంచి టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటు థీమ్ సాంగ్ కూడా వచ్చింది.

ఇక ఈ మూవీ టీజర్ ని ఈ నెలలోనే మూడో వారంలో లేదంటే నాలుగో వారంలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా సముద్రఖని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో టైమ్ ని రిప్లిక అయిన పాత్రలో నటిస్తున్నారు. ఇక తేజ్ మార్కండేయ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ రెండు పాత్రల మధ్య బాండింగ్ తోనే ఈ కథ ఉంటుంది. గోపాల గోపాల తరహాలోనే బ్రో మూవీ కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ పాత్రతోనే కథ మొత్తం చెప్పబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. టీజర్ రిలీజ్ అయితే మూవీపై మరింతగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతోన్న చిత్రం ఇదే కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











