వకీల్ సాబ్ కోసం బిజీగా మారిన పవన్ కళ్యాణ్.. ఇదే ఆఖరి పని!
కరోనా లాక్ డౌన్ తరువాత టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న అతి పెద్ద సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాల డోస్ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ మొదటిసారి ఒక లాయర్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
అసలు మ్యాటట్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి. అయితే ఫైనల్ గా ఒక్క డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలాయి. అది కూడా పవన్ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ మాత్రమే. ఇక ఈ ఆఖరి పనిని పవన్ ఇటీవల స్టార్ట్ చేశారు. వీలైనంత తొందరగా ఈ వర్క్ ను ఫినిష్ చేయాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పవన్ రెగ్యులర్ పాలిటిక్స్ ను ఏ మాత్రం మిస్సవ్వడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై ప్రజల పని తీరుపై స్పందిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా పవన్ తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ మాత్రం చేయడం లేదు. దాదాపు అందరు నటీనటులు వారి సినిమాల కోసమే సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. కానీ పవన్ మాత్రం ఏ రోజు కూడా తన సినిమాలపై సింగిల్ ట్వీట్ కూడా చేసుకోలేదు. నిరంతరం అందులో ప్రజలకు సంబంధించిన విషయాలపైనే స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











