twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్టిచ్చిన దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయకపోవడానికి కారణమిదే!

    |

    టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత వరుసగా సినిమాలు సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఓ విధంగా పవన్ తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు సినిమాలు ఆగిపోవడం కొంత షాక్ కి గురి చేసింది.

    లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఇప్పటికే ఒక సినిమాను రిలీజ్ చేసి మరొక సినిమాను కూడా పూర్తి చేసి పనిలో బిజీగా ఉండేవాడు. వకీల్ సాబ్ ని ఆల్ మోస్ట్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా అనంతరం క్రిష్ సినిమాతో బిజీ కానున్నాడు. అనంతరం హరీష్ శంకర్ తో ఒక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

    Pawan kalyan canceled another projects for political career

    గతంల్ వీరి కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకున్నాయి. ఇక మరొసారి కిషోర్ కుమార్ తో కలిసి పవన్ వర్క్ చేయాలని అనుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదనే వార్తలు కూడా వచ్చాయి.

    అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ని దర్శకుడు డాలీ రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్నారట. కుదిరితే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఎదో ఒక కథతో సినిమా స్టార్ట్ చేసేవారట. పవన్ రాజకీయాలకు మరీ దూరంగా ఉండదకుడదని ప్రస్తుతానికి ఎలాంటి కథలను ఒకే చేయడం లేదని తెలుస్తోంది.

    English summary
    Tollywood power star Pawan Kalyan has come up with a series of films after several days. Officially announces the back-to-back three films never before. Pawan's decision was a shock to fans of the film, but now the film has stopped due to the corona virus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X