Pawan Kalyan Trending: అలజడి సృష్టించిన పవర్ స్టార్.. ఒక్క ఫొటో మార్పుతో సోషల్ మీడియా షేక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు ప్రజాసేవలో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఇక సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. జనసేన పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరణ ఇస్తున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఒకే ఒక ఫోటో చేంజ్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది.

ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఏదో ఒక ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార ప్రభుత్వం తప్పులను కూడా నిత్యం ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు.

Pawan kalyan changed twitter display picture after long time trending

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక ఫోటో చేంజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో డిస్ ప్లే పిక్చర్ ను చాలా రోజుల తర్వాత మార్చడంతో ఆ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకుముందు చివరగా 2019లో ఒక ఫోటోను డిస్ప్లే పిక్చర్ గా పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకులు గా నిలబడి ఉన్న మరో సరికొత్త ఫోటోను పోస్ట్ చేశాడు.

దీంతో ఫోటో గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హరి హరి వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు అనంతరం మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X