లాక్‌డౌన్‌లో పవన్ కల్యాణ్ స్టోరీ ఫినిష్.. ఎన్టీఆర్ పేరును వాడడానికి కారణం ఇదే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... రెండు తెలుగు రాష్ట్రాలో ఈ పేరు ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సుపరిచితుడు అయిన ఆయన... భిన్న వ్యక్తిత్వంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే కొన్ని విజయాలను అందుకుని స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్యనే రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్... లాక్‌డౌన్ పిరియడ్‌లో ఓ సినిమా కోసం కథ రాశాడట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

రాజకీయాల కోసం సినిమాల్లోకి రీఎంట్రీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగిన పవన్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

పొలిటీషియన్ కాస్తా... వకీల్ సాబ్‌గా
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవన్ కల్యాణ్.... సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తుందీ మూవీ. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పవన్ జెట్ స్పీడు.. ఏకంగా మూడు
రీఎంట్రీలో సూపర్ స్పీడు చూపిస్తున్నాడు పవన్. ‘వకీల్ సాబ్' మూవీ పట్టాలపై ఉండగానే.. మరో రెండు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా... మరొకటి హరీశ్ శంకర్ రూపొందించనున్నాడు. ఈ మూడింట్లో క్రిష్ దర్శకత్వంలో వచ్చేది కొంత ప్రత్యేకమైనదని చెప్పాలి. దీనికి కారణం అది పిరియాడిక్ మూవీ కావడమే.

తొలి సినిమా... పవన్ కొత్త ప్రయోగాలు
ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ తెరకెక్కించే చిత్రానికి ‘విరూపాక్ష' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పవన్ కెరీర్‌లో తొలి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. దీంతో ఈ మూవీ కోసం ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. దీని కోసం తొలిసారి కత్తిసాము సహా కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. అలాగే, విగ్గుతో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

లాక్‌డౌన్‌లో సినిమా కథ రాసిన పవన్
క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి దొంగ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ మూవీ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ లాక్‌డౌన్ పిరియడ్ రచయితగా మారాడని, స్క్రిప్ట్ కూడా రాశాడని తాజాగా ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.
Recommended Video

ఎన్టీఆర్ పేరును వాడడానికి కారణం ఇదే.!
పిరియాడిక్ జోనర్‌తో రూపొందనున్న క్రిష్ సినిమా సెకెండాఫ్‌ను పవన్ స్వయంగా రాశాడనేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, దొంగ పాత్రను మరింత ఎలివేట్ చేసేలా ఆయన కథను సిద్ధం చేశాడట. అందుకే ఈ మూవీకి ‘విరూపాక్ష'ను కాదని.. ఎన్టీఆర్ నటించిన సినిమా పేరు ‘గజదొంగ'ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











