Pawan Remuneration: పవన్ OG రెమ్యూనరేషన్ లీక్.. అన్ని కోట్లతో సంచలన రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అంతలా అతడికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మధ్య కాలంలో అభిమానుల కోసం వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'OG' ఒకటి. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఆ సినిమాలతో ఫుల్ బిజీగా:రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తోన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అందులో క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సముద్రఖనితో 'బ్రో' వంటి సినిమాలు చేస్తోన్నాడు. వీటితో పాటు సుజిత్ దర్శకత్వంలో 'OG' అనే సినిమాలో కూడా పవన్ కల్యాణ్ నటిస్తోన్నాడు.

Pawan Kalyan Charges Rs 100 Crore Remuneration for OG Movie

గ్యాంగ్‌స్టర్‌గా మారిన పవన్:పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

శరవేగంగా షూట్.. అక్కడే:పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవన్నీ అద్భుతంగా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan Charges Rs 100 Crore Remuneration for OG Movie

అప్పుడే రిలీజ్ చేయాలని:పవన్ కల్యాణ్ హీరోగా.. సుజిత్ తెరకెక్కిస్తోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారట. దీన్ని ఎలాగైనా అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం.

Pawan Kalyan Charges Rs 100 Crore Remuneration for OG Movie

పవన్ రెమ్యూనరేషన్ లీక్:సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత ఏకధాటిగా మూవీలను చేస్తూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో కంటే ఇప్పుడు అతడి మార్కెట్ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో రెమ్యూనరేషన్లు కూడా గట్టిగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 'OG' మూవీ కోసం పవన్ కల్యాణ్ ఏకంగా రూ. 100 కోట్లు చార్జ్ చేశాడని తెలిసింది.

Pawan Kalyan Charges Rs 100 Crore Remuneration for OG Movie

ఆ లిస్ట్‌లో చేరిన స్టార్ హీరో:నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 60 - 70 కోట్లు చార్జ్ చేసేవాడని టాక్ ఉంది. అయితే, ఇప్పుడు 'OG'కి మాత్రం దానయ్య ఏకంగా వంద కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. ఫలితంగా ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఇంత మొత్తం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి పవన్ కూడా చేరినట్లు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X