నిక్కరుతో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. అకిరా నందన్ కంటే బక్కగా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు పాలిటిక్స్ తో పాటు మరోవైపు సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. కెరీర్ ల్ మొదటిసారి పవన్ ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. పైగా రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక పోటో వైరల్ అయ్యింది. నిర్మాత బండ్లగణేష్ ఆ ఫొటోను పోస్ట్ చేసి మరోసారి పాజిటివ్ కామెంట్ చేశాడు.

తక్కువ సమయంలోనే
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. మొదటి నుంచి కూడా కాస్త భిన్నంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక పాలిటిక్స్ కు వచ్చిన అనంతరం సినిమాలకు దురమవుతారేమో అని అభిమానులు కంగారు పడుతున్న క్రమంలో మళ్ళీ ఎప్పటిలానే డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాతో రాబోతున్నాడు. హరీష్ శంకర్ తో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే సురేంధర్ రెడ్డితో కూడా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు.

నిక్కరుతో పవన్ కళ్యాణ్
ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల బండ్ల గణేష్ పోస్ట్ చేసిన మరొక ఫొటో కూడా అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ పసివాడే నా దేవర అని పవన్ ను ట్యాగ్ చేశాడు. చిన్నప్పుడు మెగా బ్రదర్స్ తో అలాగే సిస్టర్స్ తో దిగిన ఆ ఫొటోలో పవన్ చిన్న నిక్కరుతో బక్కగా కనిపిస్తున్నాడు.

పవన్ కు మరో పేరు పెట్టుకున్న బండ్ల గణేష్
దాదాపు పవన్ పెద్ద కొడుకు అకిరా నందన్ కూడా మొన్నటి వరకు అలానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కూడా సింపుల్ గా ఉండటాన్ని అలవాటుగా చేసుకున్నట్లు అర్ధమవుతోంది. ఇక బండ్ల గణేష్ ఇటీవల పవన్ కు దేవర అని పేరు పెట్టుకున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన బండ్ల గణేష్ మరో సినిమా కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











