'ఆరెంజ్' దెబ్బకు అన్నయ్య ఆస్తుల్ని అమ్ముకున్నాడు.. అప్పుడు నేనే అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్
రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి విపత్తులు చోటు చేసుకున్నా కూడా అందరి ఫోకస్ ఎక్కువగా ఫిల్మ్ స్టార్స్ పైనే ఉంటుంది. కోట్లు కోట్లు సంపాదించే స్టార్స్ విరాళాలు ఎంత ఇస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే ప్రతిసారి ఇలా సినీ స్టార్స్ అలాగే వ్యాపారవేత్తలు ఇవ్వడం కన్నా కూడా ప్రభుత్వాలు ముందస్తు చర్యలతో జాగ్రత్తగా ఉండి ప్రజలకు సహాయంగా ఉండాలని పవన్ కళ్యాణ్ తన ఆలోచనను వ్యక్త పరిచారు. అదే విధంగా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ కోసం ఖర్చు చేసే వేలకోట్లు బయటకు తియ్యాలని అన్నారు.

సినిమా నష్టపోతే.. అది కూడా మిగలదు
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కోటి సంపదిస్తే అందులో సినిమాకు సంబంధించిన ట్యాక్స్ లు ఖర్చులు అన్ని పోయి ఒక నిర్మాత చేతికి 60లక్షల లోపు ఆదాయం మాత్రమే మిగులుతోంది. సినిమా నష్టపోతే కొన్నిసార్లు అది కూడా మిగలకపోవచ్చు. ప్రతిసారి విరాళం ఇవ్వాలని వాళ్ళపై కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తోచినంత వారు సహాయం అందిస్తే పరవాలేదు.

ఆరెంజ్.. అన్నయ్య ఆస్తులు పోయాయి
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా పోతే ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు. అన్నయ్య నాగబాబు ఆరెంజ్ సినిమా నిర్మించినప్పుడు ఆ నష్టం యొక్క విలువ ఎంత భారంగా ఉంటుందో అర్ధమయ్యింది. ఆ సినిమా పోయినప్పుడు ఆయన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో మేము తలో చేయి వేసి బయటకు తీసుకువచ్చాము.

అత్తారింటికి దారేది లీక్ అయినప్పుడు
అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే చాలా వరకు లీక్ అయ్యింది. నిజంగా ఆ సినిమాను కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నేను సంతకాలు పెట్టి హామీ ఇచ్చిన తరువాత థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఒక సినిమాకు పేరు ఆకాశమంత ఉంటుంది గాని డబ్బు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. పది కోట్ల సినిమాకు వంద కోట్లు వచ్చాయని అనిపిస్తోంది. కానీ చివరికి కోటి మిగలవచ్చే. లేదా అవి కూడా రాకపోవచ్చు.

మీరెందుకు సహాయం చేయలేదు అంటే?
నిజానికి లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా పనులు లేవు. అయినప్పటికీ సినిమా వాళ్ళు విరాళాలు అందించాల్సి వచ్చింది. ఇక బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కరోనా సంక్షోభంలో 25కోట్ల వరకు సహాయం అందించారు. నేను కోటి రూపాయలు ఇచ్చాను. ఎవరి స్థాయి వాళ్ళది. ఎవరి పరిధిలో వాళ్ళు సహాయం చేశారు. అయితే ఈ విషయంలో మీరెందుకు సహాయం చేయలేదు అని అడిగే హక్కు ఎవరికి లేదు.

అలా చెప్పేవాళ్ళు సహాయం చేస్తున్నారా?
విరాళాలు పెద్దగా సరిపోవడం లేదని చెప్పేవాళ్ళు నిజంగా వారి జేబులో నుంచి కనీసం ఒక పది రూపాయలైనా ఇచ్చారా? కష్టపడి పని చేసేవారికి జేబులోంచి పది లక్షలు ఇవ్వాలి అంటే మనసు ఒప్పుకుంటుందా? రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు వందల కోట్లు ఖర్చు చేసేవారు ఇలాంటి కష్ట సమయంలో అదే డబ్బు ఖర్చు పెడితే ఒక విధంగా బాగానే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో లాభాలు ఎంత ఉన్నా నష్టాలు వస్తే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నమ్మకం లేని ఈ ప్రపంచంలో రేపటి గురించి ఆలోచించేవారే సేఫ్ జోన్ లో ఉంటారని పవన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











