BRO: పవన్ ఖాతాలో మరో రికార్డు.. ఏ స్టార్ హీరో చేయనంత స్పీడ్‌గా!

సాధారణంగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సినిమా చేయాలంటే కొంతలో కొంత కనీసం ఏడాది సమయం అయినా తీసుకుంటున్నారు. కానీ, ఒకే ఒక్క హీరో మాత్రం ఏక కాలంలోనే వరుసగా మూవీలను చేస్తూ సత్తా చాటుతోన్నాడు. అతడే టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీలో పలు చిత్రాలతో అలరించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు నాలుగు చిత్రాలతో బిజీగా గడుపుతోన్నాడు. అందులో 'బ్రో (BRO)' మూవీ ఒకటి. మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

'బ్రో (BRO)' మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Pawan Kalyan Completed His Part in BRO Movie

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించి ఆరంభంలోనే పవన్ కల్యాణ్ పార్టుకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌పై సీన్స్ షూట్ చేశారు. ఇలా తాజాగా పవన్ కల్యాణ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేసేశాడని తెలిసింది. తాజాగా జరిగిన షెడ్యూల్‌లో పవర్ స్టార్ ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు ఓ ఫైట్ సీన్‌ను కంప్లీట్ చేశాడట. దీంతో కేవలం మూడు నెలల్లోనే పవన్ ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు అయింది. తద్వారా ఇంత వేగంగా సినిమా కంప్లీట్ చేసిన రికార్డును అతడు సాధించాడు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X