Bro: పవన్ ఫ్యాన్స్ ఇక కాచుకోండి.. అవతారం చాలించిన బ్రో
తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ఇలాంటి తరహా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మలీస్టారర్ చిత్రమే 'బ్రో (BRO)'. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్..
అతడి మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఇది తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు.

మెగా హీరోల కలయికలో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా తీస్తున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కీలకమైన షెడ్యూల్‌ను జరుపుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొంటున్నారు. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్‌ను సైతం షూట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.
'బ్రో (BRO)' మూవీకి సంబంధించి ఆరంభంలోనే పవన్ కల్యాణ్ పార్టుకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కంప్లీట్ చేసేశారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక, కొద్ది రోజులుగా ఇద్దరిపై కాంబో సీన్స్‌తో పాటు స్పెషల్ సాంగ్‌ను కంప్లీట్ చేశారు.

ఇలా తాజాగా పవన్ కల్యాణ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేసేశాడని తెలిసింది. మంగళవారం జరిగిన స్పెషల్ సాంగ్‌తోనే అతడు ఈ సినిమా నుంచి రిలీవ్ అయ్యాడట. అంటే.. డబ్బింగ్ మాత్రమే చెబితే పవన్ 'బ్రో (BRO)' అవతారాన్ని ముగించేస్తాడని చెప్పొచ్చు.
పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











