twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని పరిస్థితి చూసి పవన్ కల్యాణ్ కంటతడి.. క్యాన్సర్ చికిత్స కోసం భారీగా ఆర్థిక సాయం.. అండగా ఉంటా అంటూ...

    |

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రజాసేవ, రాజకీయాలతో మమేకం అవుతున్నారు. తాజాగా తన అభిమాని, జనసేన కార్యకర్త అనారోగ్యం పాలు కావడంతో అతడిని పరామర్శించేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించారు. తన అభిమానిని కలిసి పరామర్శించడమే కాకుండా ఆర్థికంగా సహాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    పవన్ కల్యాణ్‌కు భారీ స్వాగతం

    పవన్ కల్యాణ్‌కు భారీ స్వాగతం


    అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని భార్గవ్‌ను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చేరుకొన్నారు. ఆయనకు దారి పొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిల్లకల్లు నుంచి లింగాల గ్రామం వరకు వందలాది బైకులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. పవన్ రాకతో లింగాల గ్రామం జనంతో కిక్కిరిసిపోయింది.

    క్యాన్సర్ వ్యాధికి గురైన భార్గవ్‌తో

    క్యాన్సర్ వ్యాధికి గురైన భార్గవ్‌తో


    జన సైనికుడు, అభిమాని భార్గవ్ ఇంజినీరింగ్ విద్యార్థి. కొద్ది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తన అభిమాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయాన్ని జనసేన నేతల ద్వారా తెలుసుకొన్న పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని మాటిచ్చారు. తన హామీ మేరకే లింగాల గ్రామంలోని భార్గవ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

    కొంటె చూపులతో కవ్విస్తోన్న కోలీవుడ్ భామ అనన్యామణి ఫొటోలు

    చలించిపోయిన పవన్ కల్యాణ్

    చలించిపోయిన పవన్ కల్యాణ్


    క్యాన్సర్ వ్యాధితో మంచంలో కదల్లేని స్థితిలో ఉన్న భార్గవ్‌ను చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. భార్గవ్ ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులు వాసవి, రామారావును అడిగి తెలిసుకొన్నారు. మూడు నెలల క్రితం క్యాన్సర్ వ్యాధికి గురయ్యారని చెప్పడంతో పవన్ ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా మీరంటే ఎంతో అభిమానం. మీ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటారు అని పవన్ కల్యాణ్‌కు తల్లిదండ్రులు చెప్పారు.

    పవన్ కల్యాణ్ 5 లక్షల సహాయం

    పవన్ కల్యాణ్ 5 లక్షల సహాయం

    భార్గవ్ అనారోగ్య పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. వైద్యానికి కావాల్సిన సాయాన్ని అందజేస్తానని చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రవాసాంధ్రుల నుంచి మరింత సాయం అందేలా చూస్తానని చెప్పారు. ఆశయ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్నారు.

    వినాయకుడి విగ్రహం బహుకరణ

    వినాయకుడి విగ్రహం బహుకరణ


    భార్గవ్‌ను క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తి చేయడానికి జనసేన పార్టీ తరఫున వైద్యుల బృందాన్ని పంపిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. భార్గవ్‌కు మెరుగైన చికిత్సను అందించేలా చర్యలు తీసుకొంటామని చెప్పారు. భార్గవ్‌కు ధైర్యం చెప్పడంతోపాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వినాయకుడి వెండి విగ్రహాన్ని అందజేశారు.

    English summary
    Pawan Kalyan condoles Cancer Patient Bhargav at lingala village of Jaggayapeta, Bhargav was a Janasena party cadre who is suffering with cancer since three months. In this occassion, Pawan annouces 5 lakhs for better treatment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X