పవన్ కల్యాణ్ ఖాతాలోకి అరుదైన రికార్డు: పవర్ స్టార్ రేంజ్ అంటే అదే!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా... తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని సూపర్ హిట్లను అందుకున్న ఆయన... భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, సినీ కెరీర్‌లో చెరిగిపోని ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న పవర్ స్టార్... తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఏంటా రికార్డు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

దాని కోసం సినిమాలను వదిలేశాడు
వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజాసేవపై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకోసం ఓ రాజకీయ పార్టీని సైతం ప్రారంభించాడు. అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

లాయర్‌గా తిరిగొస్తున్న పవర్ స్టార్
రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్ కల్యాణ్... సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాను ఎంచుకున్నాడు. ఈ మూవీ రీమేక్ ద్వారానే పవర్ స్టార్ తిరిగొస్తున్నాడు. ‘వకీల్ సాబ్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్పీడు పెంచిన పవన్.. మరో రెండు
రీఎంట్రీలో పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్... క్రిష్ జాగర్లమూడితో పాటు హరీశ్ శంకర్‌తో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో మొదటి దానిని మైత్రీ మూవీ మేకర్స్, రెండో దానిని ఏఎమ్ రత్నం నిర్మించనున్నారు.

పవన్ ఆశలపై నీళ్లు జల్లిన కరోనా
వరుసగా సినిమాలు ఒప్పుకోవడంతో పాటు మరిన్ని కథలను వింటున్నాడు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేసుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సైతం సిద్ధం చేసుకున్నాడు. కానీ, ఇంతలో కరోనా రూపంలో ఆటంకం ఏర్పడింది. దీంతో ‘వకీల్ సాబ్' సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

ఫ్యాన్స్ అప్పుడే మొదలుపెట్టారు
పవన్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, దానికి సమయం పట్టేటట్లు ఉండడంతో వాళ్లంతా నిరాశకు లోనవుతున్నారు. ఇదిలాఉండగా, సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు. దీనికోసం నెల రోజుల ముందుగానే ఆయన అభిమానులు హడావిడి మొదలెట్టారు. AdvanceHappyBirthdayPawanKalyan అనే క్యాంపైన్ కూడా స్టార్ట్ చేశారు.

పవన్ ఖాతాలోకి అరుదైన రికార్డ్
కొన్నేళ్లుగా తమ అభిమాన హీరోల పుట్టినరోజులను ఫ్యాన్స్ వినూత్నంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో సదరు హీరో పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ రికార్డులనే అందరూ లెక్కించారు. ఇదే ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా రోజుల క్రితమే మొదలైంది. తాజాగా అందులో పవన్ పేరుతో రికార్డ్ నమోదైంది.
Recommended Video

తెలుగు హీరోకూ సాధ్యం కాని ఘనత
తమ అభిమాన హీరో పుట్టినరోజుకు సంబంధించిన ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పోస్టులు వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో నలుగురు హీరోలకు సంబంధించిన ట్యాగ్ మిలియన్ మార్క్‌ను చేరుకుంది. ఇప్పుడు AdvanceHappyBirthdayPawanKalyan కూడా ఆ మైలురాయిని అందుకుంది. ఇన్‌స్టా అకౌంట్ లేకపోయిన మిలియన్ పోస్టులు అందుకున్న హీరోగా పవన్ రికార్డులకెక్కాడు.


Click it and Unblock the Notifications











