చరిత్ర సృష్టించిన పవన్.. ఇండియాలోనే ఏ హీరోకూ సాధ్యం కాని విధంగా వరుసగా ఐదేళ్లు.!
పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక, ఆయన పుట్టినరోజున ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులన్నీ మొదలయ్యాయి. ఇక, ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం.. పవన్ డీపీలు, ఫ్లెక్సీలు ఇలా రచ్చ రచ్చ చేసేశారు.

పవన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది
సోమవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయన పేరుతో మారుమ్రోగిపోయింది. ఫ్యాన్స్‌తో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్‌కు విషెస్ చెప్పారు. ముఖ్యంగా పవన్‌తో అనుబంధం ఉన్న చాలా మంది ప్రముఖులు తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో పవన్ నామస్మరణతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది
37 నిమిషాల్లోనే మిలియన్
ఇక, #HappyBirthdayPawanKalyan ట్యాగ్ పెట్టిన 37 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. ఇలా మరే హీరోకూ ఇప్పటి వరకు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేందుకు ఇటీవల చిరంజీవి పుట్టినరోజున కూడా ఈ రేంజ్‌లో ట్వీట్లు పెట్టలేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ క్రేజ్‌ను తెలుపడానికి మరో ఉదాహరణగా దీనిని అభివర్ణిస్తున్నారు.
పవన్ కల్యాణ్ నేషనల్ రికార్డ్
37 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్స్ వచ్చిన #HappyBirthdayPawanKalyan ట్యాగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఇదే ట్యాగ్‌తో 24 గంటల్లో 10.05 మిలియన్స్ ట్వీట్లు చేశారు. దీంతో ఒక హ్యాష్ ట్యాగ్ ఈ రేంజ్‌లో ట్వీట్లు దక్కించుకోవడం రికార్డు అని విశ్లేషకులు చెబుతున్నారు. అది కూడా ఒక సినీ హీరోకు ఇలాంటి రెస్పాన్స్ గతంలో ఎప్పుడూ రాలేదని అంటున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

చరిత్ర సృష్టించిన పవన్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమాన నటులకు సంబంధించిన ప్రత్యేకమైన రోజులను ఫ్యాన్స్ ఎంతగానో గ్రాండ్‌గా జరుపుతున్నారు. ఇవి ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఒక్క సంవత్సరమే ట్విట్టర్‌లో ట్రెండ్ అవలేదు. 2015 నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఆయన పుట్టినరోజు ట్రెండ్ అవుతోంది. దీంతో పవన్ చరిత్ర సృష్టించాడు.


Click it and Unblock the Notifications











