డప్పుల శబ్దం వినగానే పవన్ కళ్యాణ్‌కు పూనకం... (డాన్స్ వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టేసి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు. తాజాగా బస్సు యాత్ర చేస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు డప్పుల మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. గతంలో ఆయన తన సినిమాల్లో సైతం ఇలాంటి సంగీతంతో ఉండే బీట్స్ కోరి మరీ పెట్టించుకునేవారు. ఆ శబ్దం వింటే పవన్ కళ్యాణ్‌కు పూనకం వస్తుందని, ఎంతో తన్మయత్వం పొందుతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అది నిజమే అని మరోసారి రుజువైంది.

వైరల్ అవుతున్న వీడియో

పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. సుద్ధగొమ్ము గిరిజిన ప్రాంతంలో ఆయనకు గిరిజనులు సంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి డాన్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ మీద పుకార్లు

పవన్ కళ్యాణ్ మీద పుకార్లు

పవన్ కళ్యాణ్ మీద ఇటీవల కొన్ని పుకార్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అందులో నిజం లేదని పవర్ స్టార్ తేల్చి చెప్పారు. ఈ మేరుక ఒక అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇదే...

పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇదే...

‘నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తతి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజా క్షేమం కోసమే. నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే.'' అని పవన్ కళ్యాణ్ ఇటీవల తన అఫీషియల్ స్టేట్మెంటులో స్పష్టం చేశారు.

సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?

సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడే చెప్పడం కష్టమే 2019 ఏపీ ఎన్నికల తర్వాత కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి మాదిరిగా కొన్నేళ్ల గ్యాప్ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే పవర్ స్టార్ నుంచి సినిమాలు వస్తేయేమో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X