వ్యవసాయం అంటే ఇష్టం... ‘మహర్షి’ మూవీ చూడబోతున్న పవన్ కళ్యాణ్
సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు... సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు తన తాజా చిత్రం 'మహర్షి' ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
నగరాల్లో జీవిస్తూ, కార్పొరేట్ ఉద్యోగాలు చేయడానికి అలవాటు పడిపోతున్న ఈ తరం యువత వ్యవసాయానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. రైతులను, వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొసాగితే దేశానికి అన్నం పెట్టే రైతు లేకుండా పోతాడని, అది మనుష్యుల ఆరోగ్యకరమైన జీవిన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ 'మహర్షి' చిత్రం గురించి తెలుసుకుని ఈ షో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ వారంలోనే ఆయన కోసం ప్రత్యేక షో వేయబోతున్నట్లు తెలుస్తోంది. చూసిన తర్వాత పవర్ స్టార్ ట్విట్టర్ ద్వారా స్పందించే అవకాశం ఉంది.
మరో వైపు 'మహర్షి' మూవీ చూసి చాలా మంది వీకెండ్ వ్యవసాయం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఉద్యోగాలు, వ్యవసాయేతర పనులు చేసే వారు... వారాంతాల్లో తమ సొంతూర్లకు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

మహేష్ బాబు గత మూవీ 'శ్రీమంతుడు' సైతం ప్రజల్లో మార్పు తెచ్చేందుకు దోహద పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా మందిలో సొంతూరికి ఏదైనా సాయం చేయాలని, పల్లె అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనకు బీజం వేశాయి. ఇపుడు 'మహర్షి' చిత్రం వ్యవసాయం వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తోంది.
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











