Pawan Kalyan 5 ఏళ్లలో 191 శాతం పెరిగిన పవన్ కల్యాణ్ ఆస్తులు.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే?

జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అశేష జన సందోహం, జనసైనికులు, అభిమానులు, ప్రజలు వెంటరాగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని జనసేనాని తన నామినేషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఉందే డిసైడ్ కావడంతో భారీగా జనం, జనసైనికులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారికి అందజేశారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో వెల్లడించిన ఆస్తుల వివరాల్లోకి వెళితే..

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆస్తులు గత 5 సంవత్సరాల్లో 191 శాతం పెరుగుదల కనిపించింది. 2019 సంవత్సరంలో ఆయన ఆస్తుల విలువ 56 కోట్ల రూపాయలు ఉండటం జరిగింది. తాజాగా తన భార్య, పిల్లలు పేర్లపై ఉన్న ఆస్తులను 163 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. గత ఐదేళ్లను పరిశీలిస్తే భారీగా ఆస్తులు పెరిగాయి. గత ఐదేళ్ల క్రితం నాటితో పోల్చుకొంటే 1.1 కోట్ల నష్టం.. ఆదాయం తగ్గిందని వెల్లడించారు.

Pawan Kalyan declared 164 crores assets with 191 percent growth in last five Years Here is the Details

పవన్ కల్యాణ్ సమర్పించిన అఫిడవిట్‌లో 46 కోట్ల రూపాయల చర ఆస్తులు, భార్య పేరున 1 కోటి రూపాయలు, తన పిల్లల పేరున 3.5 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిపారు. అలాగే 118 కోట్ల స్థిర ఆస్తులు.. జన్వాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్‌లో భవనాలు, భూములు రూపంలో ఉన్నాయని తెలిపారు.

Pawan Kalyan declared 164 crores assets with 191 percent growth in last five Years Here is the Details

ఇక ఇదిలా ఉండగా, తనకు సుమారుగా 65 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. వదిన, నిర్మాతలు నవీన్, దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, వదిన సురేఖ ఇతర స్నేహితుల నుంచి వ్యక్తిగత రుణాలను తీసుకొన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇక పవన్ కల్యాణ్ తన విద్యార్హతలను కూడా ఎలక్షన్ కమిషన్‌కు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో స్పష్టంగా వెల్లడించారు. తాను 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యానని, తన విద్యాభ్యాసం నెల్లూరులో జరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X