twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ పవర్ స్టార్..తొమ్మిది పేజీల డైలాగ్ సింగిల్ టేక్..ఊరికే స్టార్స్ అయిపోరు మరి!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్స్ విషయంలో కొన్ని తేడాలు ఉండటంతో ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ విషయం అధికారికంగా ప్రకటించలేదు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ నటనకు సంబంధించిన ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు ఒక సహ నటుడు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

    వకీల్ సాబ్ కి సూపర్ రెస్పాన్స్

    వకీల్ సాబ్ కి సూపర్ రెస్పాన్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించాడు. హిందీ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ లకు సంబంధించి కొంత వివాదం నడవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత అనే విషయం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఆ విషయం పక్కన పెడితే ఆయన మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు.

     ఫ్యాన్స్ కోసం ఫీస్ట్

    ఫ్యాన్స్ కోసం ఫీస్ట్

    నాలుగు సినిమాల్లో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ కూడా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు.

     తొమ్మిది పేజీల డైలాగ్ సింగిల్ టేక్

    తొమ్మిది పేజీల డైలాగ్ సింగిల్ టేక్

    వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో కోర్టు సీన్ లో పవన్ నటన అద్భుతం అని చెప్పక తప్పదు. న్యాయవాదిగా పవన్ ఆ సీన్స్ లో అధ్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ లాంగ్ సీన్ లో పవన్ కళ్యాణ్ ఒక భారీ డైలాగ్ కూడా చెబుతారు. ఈ డైలాగ్స్ అన్నిటికీ ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చుకుంది. కానీ చాలా మందికి ఈ సీన్ వెనుక ఉన్న కథ తెలియదు. పవన్ కళ్యాణ్ పలికిన డైలాగ్స్ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది పేజీల వరకు ఉంటాయట, మామూలుగా అయితే ఇవన్నీ సింగిల్ టేక్ లో చెప్పలేరు, కానీ పవన్ అన్నిటినీ సింగిల్ టేక్ లో చెప్పారట.

    యూనిట్ సభ్యులు మొత్తం చప్పట్లతో

    యూనిట్ సభ్యులు మొత్తం చప్పట్లతో

    పవన్ కళ్యాణ్ ఒకే టేక్‌లో తొమ్మిది పేజీల మొత్తం డైలాగ్‌లను చెప్పేశాడని ఆ సీన్ లో నటించిన శివ అనే నటుడు వెల్లడించాడు. ఈ సీన్ షూట్ చేసేప్పుడు ఎనిమిది కెమెరాలను ఉంచారు. మరియు రోలింగ్ చేస్తున్నప్పుడు, పవన్ ఈ సన్నివేశాన్ని ఒకే టేక్‌లో పూర్తి చేశాడు, ఇది మామూలుగా చేయగలిన ఫీట్ కాదని, సీన్ పూర్తయిన వెంటనే, యూనిట్ సభ్యులు మొత్తం పవన్‌కళ్యాణ్‌కు చప్పట్లు కొడుతూ భారీగా అప్లాజ్ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy
    ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు

    ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు

    ఇది మాత్రమే కాదు, సినిమా చేస్తున్న సమయంలో ఆయన రాజకీయ సమావేశాలు కూడా జరిగేవని, రాత్రుళ్ళు సమావేశాలు పెట్టుకుంటూ ఉదయం షూటింగ్ చేస్తూ కష్టపడేవాడని ఆయన పేర్కొన్నారు. సమావేశాలు ముగించిన తర్వాత, అతను తిరిగి సెట్ లోకి వచ్చేవారని చెప్పుకొచ్చారు. పవన్‌కళ్యాణ్‌ నిబద్ధత చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. ఊరికే sస్టార్స్ అవ్వరని, అంత టాలెంట్ ఉంది కాబట్టే అయ్యారని ఆయన పవన్ గురించి చెప్పుకొచ్చారు.

    English summary
    Pawan Kalyan came with vakeel saab after three-years. The film was a huge success with Pawan’s mannerism and the heroic elements shown in the movie. especially the courtroom scene, is one of the highlights in Vakeel Saab. The dialogues mouthed by Pawan kalyan runs across pages, nearly eight to nine pages revealed by actor in that scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X