Pawan Kalyan: ఉన్నతమైన భాష మాట్లాడి నీచమైన ఆలోచన.. ఆసక్తికరంగా పవన్ కల్యాణ్ డైలాగ్

తెలుగు రాష్ట్రాల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఏమాత్రం క్రేజ్​ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్​ కల్యాణ్​ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్​ పెంచుకుంటూ పోయే పవన్​ కల్యాణ్​ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. దానికి సంబంధించి ఏదైనా అప్​డేట్​ వస్తే చాలు రచ్చ రచ్చే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ గ్లాన్స్ అనే విడుదల చేయగా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ ఇచ్చింది.

సినిమాల మీద సినిమాలు..

సినిమాల మీద సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో టాలీవుడ్‌లో బడా హీరోగా వెలుగొందుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ స్టార్ హీరో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు.

 భారీ స్థాయిలో స్పందన..

భారీ స్థాయిలో స్పందన..

ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో పవన్ రెట్టించిన జోష్‌తో ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఈ మెగా హీరో ఎన్నో చిత్రాలను కూడా మొదలు పెట్టేశాడు.

అందులో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది.

 సజావుగా సాగడం లేదు..

సజావుగా సాగడం లేదు..

కానీ, మధ్యలో కొన్ని అవాంతరాలు రావడంతో చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ చాలా వరకూ పెండింగ్ పడింది. దీంతో వీలు కుదిరినప్పుడల్లా పవన్ ఈ మూవీ షూట్‌లో పాల్గొంటున్నాడు పవన్ కల్యాణ్. 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టులోనే పున: ప్రారంభం కావాల్సి ఉన్నా.. అలా జరగలేదు.

ఉన్నతమైన భాష మాట్లాడి..

ఉన్నతమైన భాష మాట్లాడి..

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ''ఉన్నతమైన భాష మాట్లాడి నీచమైన ఆలోచన.. లేదా, ముసలి భాష మాట్లాడి ఉన్నతమైన ఆలోచన.. రెండు కాంట్రాస్ట్ గా ఉంటాయి'' అంటూ పవన్ చెప్పడంతోపాటు ఆయన లుక్ కూడా అద్భుతంగా ఉంది. అయితే ఈ డైలాగ్ సినిమాలో ఉంటుందని సందేహం కలుగుతోంది.

 అక్టోబర్ మధ్యలో..

అక్టోబర్ మధ్యలో..

ప్రస్తుతం ఈ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ను అక్టోబర్ మధ్యలో (అక్టోబర 17గా ప్రచారం) ప్రారంభించనున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. దీంతో పవన్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

4 గంటల్లోనే 10 లక్షల వీక్షణలు..

ఇక సెప్టెంబర్​ 2 అంటే శుక్రవారం పవన్ కల్యాణ్ బర్త్​డే సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి పవర్​ గ్లాన్స్​ పేరిట ఒక టీజర్​ను విడుదల చేశారు. ఈ టీజర్​ అద్భుతంగా ఉండి నెటిజన్ల నుంచి అదిరిపోయే టాక్ వచ్చింది. ఎంతలా అంటే హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్​ విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షల వీక్షణలు పొంది రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X