గుర్తించని వీరుడు ఒక్కడున్నాడు.. కేక పెట్టిస్తున్న పవన్ పవర్‌ఫుల్ డైలాగ్
Recommended Video
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సెన్సేషనల్‌గా మారింది. ఆ డైలాగ్ ఏమిటంటే..

చిరు బర్త్ డే కానుకగా
అయితే చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సైరా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే టీజర్ కోసం పవన్ కల్యాణ్ చేత వాయిస్ ఓవర్ చెప్పించారు. ఈ వాయిస్ ఓవర్ అభిమానులకు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు. ఈ టీజర్ కోసం పవన్ చెప్పిన వాయిస్ ఓవర్‌కు సంబంధించిన ఓ డైలాగ్ క్రేజీగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నది.

పవన్ చెప్పిన డైలాగ్
అందరూ గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు. కానీ ఎవరూ గుర్తించని వీరుడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి అంటూ సైరా కోసం పవన్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ టీజర్ ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ వాయిస్ ఓవర్ చెప్పిన టీజర్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

స్టార్ హీరోలతో కళకళ
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.

300 కోట్ల బడ్జెట్‌తో
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగకావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై 300 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


Click it and Unblock the Notifications











