రక్తంతో పవన్ కళ్యాణ్ బొమ్మ.. ఇది ఏం అభిమానంరా అయ్యా.. చేతులెత్తి మొక్కిన బండ్లన్న

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే బాక్సాఫీస్ విజయాలను బట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎవరూ ఊహించని విధంగా పర్సనల్ క్యారెక్టర్ తో అభిమానులు పెరిగారు. అతని సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. సక్సెస్ ఉన్నా లేకపోయినా అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అందుకుంటూ వచ్చాడు. అతని స్టార్ హోదాను చూసి మిగతా సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు.

ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని స్టార్ దర్శకులు సైతం క్యూ కట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నేటి యువతరంలో అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల ఒక అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో బొమ్మ గీయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా..

చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిన్న ఫోటో లీక్ అయినా కూడా సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు రాజకీయాల్లో ప్రజాసేవలో బిజీ అవుతూ వస్తున్నాడుమ్ ఒక విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు.

పవన్ కళ్యాణ్ 50

పవన్ కళ్యాణ్ 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న 50వ వసంతం లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ పుట్టిన రోజును అభిమానులు ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఎన్నో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రామాల్లో అయితే భారీ స్థాయిలో కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఏకంగా రక్తంతో..

ఇటీవల ఒక అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో పవన్ కళ్యాణ్ బొమ్మలు పేపర్ పైన దించేశాడు. రక్తాన్ని జాగ్రత్తగా తీసుకుని ఆర్ట్ వర్క్ తో తన అభిమానాన్ని చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ని చూసిన అభిమానులు ఇది ఎక్కడి అభిమానంరా బాబు ఉంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క వీడియో తో అర్థమవుతుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

చేతులెత్తి మొక్కిన బండ్ల గణేష్

చేతులెత్తి మొక్కిన బండ్ల గణేష్

ఇక వీడియో నిర్మాత బండ్ల గణేష్ దృష్టికి వెళ్లడంతో సోషల్ మీడియాలో రీట్వీట్ చేశాడు. చేతులెత్తి మొక్కుతున్న ఏమోజీలను ట్వీట్ చేశాడు. దీంతో ఆ వీడియో మరింత వైరల్ గా మారింది. చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఈరోజు రాత్రి నుంచి సోషల్ మీడియాలో సరికొత్త తరహాలో ట్రెండ్ అవుతుందని అర్థమవుతోంది. ట్విట్టర్ లో పాత రికార్డులు కూడా బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. ఇక వరుసగా నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X