మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: మరోసారి ఆ ప్రయోగం చేస్తున్న పవన్.. ఫ్లాప్ వచ్చినా తగ్గట్లేదు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరం అయినప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయం గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. మెగా అభిమానులకు పండుగ లాంటి ఈ వార్త గురించి తెలుసుకుందాం.!

రీఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేసిన పవన్
రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రావడం కష్టమే అన్న టాక్ వినిపించింది. అయితే, పవర్ స్టార్ మాత్రం దానికి భిన్నంగా రీఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఒక్క సినిమా కాదు.. ఆయన ఏకంగా మూడు ప్రాజెక్టులకు సంతకం చేసేశాడు. అవే... వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్'తో పాటు క్రిష్, హరీశ్ శంకర్‌లతో ఆయన మూవీ చేస్తున్నారు.

ఏమాత్రం తగ్గలేదు.. అందుకే అలా వచ్చింది
దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్'.. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా వస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, మొదటి పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో పలు రికార్డులు బద్దలైపోయాయి.

ఆ సినిమా మాత్రం ఆయనకు ప్రత్యేకమైనది
రీఎంట్రీలో పవన్ కల్యాణ్ నటిస్తున్న మూడు సినిమాల్లో క్రిష్ తెరకెక్కిస్తున్నది కొంత ప్రత్యేకమైనదే అని చెప్పవచ్చు. దీనికి కారణం ఈ మూవీ పిరియాడిక్ జోనర్‌లో తెరకెక్కుతుండడమే. కోహినూర్ డైమండ్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీకి ‘విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇప్పటి వరకు కనిపించలేదు.. హీరోయిన్ ఎవరు.?
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం అతడు మొదటి సారిగా విగ్గును కూడా వాడుతున్నాడని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రగ్యా జైస్వాల్, కియారా అద్వాణీ, వాణీ కపూర్ పేర్లు తెరపైకి వచ్చినా క్లారిటీ మాత్రం రాలేదు.

మరోసారి ఆ ప్రయోగం చేస్తున్న పవన్ కల్యాణ్
తాజాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో ఆయన డుయల్ రోల్ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే పవర్ స్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.
Recommended Video

అప్పుడు ఫ్లాప్ వచ్చినా ఇప్పుడు తగ్గట్లేదు.!
పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఒకే ఒక్కసారి మాత్రం ద్విపాత్రాభినయం చేశాడు. జయంత్ సీ పరాన్జీ తెరకెక్కించిన ‘తీన్‌మార్'లో అతడు రెండు పాత్రల్లో కనిపించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీని తర్వాత అంటే ఇప్పుడు క్రిష్ సినిమాలో పవన్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











