సినిమా పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఏ ఒక్క ఫ్యామిలీది కాదు.. పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ వార్నింగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ..

తెలుగు సినిమా పరిశ్రమ ఏ ఒక్కరి కాదు.. ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ సినిమా పరిశ్రమ అందరిది. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. నిలబడే గుండె ధైర్యం మీరు (ప్రేక్షకులు) ఇచ్చారు. మీ అభిమానం ఇచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చింది. మెగా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నా.. ఏ ఒక్కరి కుటుంబానిది కాదు. ప్రతీ సినిమా రిలీజ్ అయితే.. మేమంతా గొప్ప విజయం సాధించాలని కోరుకొంటాం. ఏ ఒక్కరి సినిమా అపజయం పొందాలని కోరుకోం అని పవన్ కల్యాణ్ అన్నారు. 24 కళలు, ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిస్తే తప్ప.. సినిమా కాదు.. అలాంటి సినిమాలను అందిస్తున్న పరిశ్రమను గౌరవించాలి. నాకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే గొప్ప గౌరవం ఉంది అని అన్నారు.
సినిమాల్లో నాకు డ్యాన్సులు చేయడం ఇష్టం ఉండదు. నా ప్రేక్షకులు, అభిమానుల కోసం నేను డ్యాన్సులు చేస్తుంటాను. మ్యూజిక్ వస్తుంటే.. నాకు నడిచి రావడం ఇష్టం. దయచేసి నాకు అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నాను. డ్యాన్సులు చేయకుండా ఉన్నందుకు నన్ను క్షమించండి. మీరు. మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటున్నాను. అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











