BRO Pre Release చాలా మందికి తెలుగు మాట్లాడటం రాదు.. మాతృభాష మాట్లాడలేని వారికి చెంపపెట్టు.. పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకొన్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కృతిశెట్టి నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
బ్రో కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికి పేరు పేరున అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ప్రసారమాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ సినిమా నాకు ఇంత అభిమానం ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి బ్రహ్మనందం నన్ను చూస్తుండే వారు. ఇంత ప్రేమ, అభిమానం కలయా? నిజమా అనిపిస్తుంది.

ఇది నేను కోరుకొన్న జీవితం కాదు.భగవంతుడు ఇచ్చిన జీవితం. ఏ రోజు చిన్న జీవితం కోరుకొన్నాను. కానీ.. ఓ నటుడు కావాలని, రాజకీయాల్లో ఉంటానని ఊహించలేదు. ఇంత అశేష ప్రేమ ఉన్నప్పుడు.. మీ పట్ల ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. సముద్రఖని చెప్పినట్టుగా సమాజం నుంచి తీసుకోవడం కాదు.. సమాజానికి ఇవ్వాలని అనుకొంటాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రతీ సినిమాలో సమాజానికి ఏదో చెప్పాలని అనుకొంటాను. కరోనా సమయంలో పాలిటిక్స్‌లోకి తిరగలేని పరిస్థితుల్లో ఈ సినిమా ముందుకు వచ్చింది. కరోనా సమయంలో ప్రముఖ దర్శకుడు, మిత్రుడు, సన్నిహితుడు త్రివిక్రమ్ ఫోన్ చేసి.. సముద్రఖని ఒక సినిమా తీశాడు. నేను చూడలేదు. సముద్రఖని కథ చెప్పాడు. కథ ఏమిటని అడిగాను? నేను ఎప్పుడు కథ గురించి పట్టించుకోను. రచయితను నమ్మేస్తాను. మార్పులు చేర్పులు అడగను. మానిటర్‌లో కూడా నేను ఎలా చేస్తున్నానని చూసుకోను. సముద్రఖని మూల కథకు త్రివిక్రమ్ సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కల్యాణ్ అనే హీరోను దృష్టిలో పెట్టుకొని స్క్రీన్ ప్లే చేశారు అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సముద్రఖని నాకు బాగా నచ్చారు. ఆయనకు అభిమానిని అయ్యాను. మనలో చాలా మందికి తెలుగు మాట్లాడటం రాదు. చాలా మంది తెంగ్లీష్ మాట్లాడలేదు. ఇంగ్లీష్ వాళ్ల తెచ్చిన వాళ్ల భాషను మాట్లాడటం రాదు. తెలుగు చదవడం రాదు.. పూర్తి వ్యాఖ్యాలను కూడా మాట్లాడటం రాదు. నేను కూడా భాషను సరిదిద్దు కొంటాను. బ్రీటీష్ వాళ్లు వచ్చి వెళ్లిన గానీ ఏ భాష మాట్లాడో తెలియడం లేదు. అలాంటి తప్పులను సరిదిద్దుకొంటూ విసిగిపోయాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కానీ సముద్రఖని తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి. తెలుగు యాస, భాష తెలియదు. అలాంటి వ్యక్తి షూటింగు తొలి రోజున స్క్రిప్టు చదువుతుంటే.. ఆయన ఏం చదువుతుంటే.. తమిళంలో రాసుకొన్నాడా? ఇంగ్లీష్‌లో రాసుకొన్నాడా అని చూశాను. కానీ ఆయన తెలుగులో రాసుకొని చదువుతున్నాడు.నేను కలగంటున్నానా? అని అప్పుడు అడిగితే ఆరు నెలల నుంచి నేను తెలుగు నేర్చుకొన్నానని చెప్పాడు. మా భాష తెలుగు నేర్చుకొన్నాను కాబట్టి నేను తమిళ భాష నేర్చుకొని మాట్లాడుతాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సముద్రఖని తెలుగు భాష నేర్చుకొంటే.. తెలుగు వారిగా మేము మా భాషను ఎంత గౌరవించాలో తెలుసుకొన్నాం. మీరు నేర్పించిన పాఠం.. అప్పుడు తెలుగు మాతృ భాష అయి ఉండి కూడా తెలుగు మాట్లాడరాని వారికి చెంపపెట్టు అని పవన్ కల్యాణ్ అన్నాడు. తెలుగులో గొప్ప దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ ఎలా అవుతారంటే.. వారిలో ఉండే భాష, సాహిత్యంపై పట్టు కారణం. సముద్రఖని తమిళంలో నేర్చుకొన్న సాహిత్యం వల్లే బ్రో లాంటి గొప్ప కథను చెప్పగలిగారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











