పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త: అందులోకి ఎంటర్ అవబోతున్న పవర్ స్టార్.. ముహూర్తం ఫిక్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలందరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే. మరే ఇతర హీరోకు లేని విధంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పవన్ సినిమా ఫ్లాప్ అయినా కలెక్షన్లు మాత్రం విపరీతంగా వస్తుంటాయి. వీళ్ల కోసమే రాజకీయాల్లోకి వెళ్లిపోయినా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు, తన అభిమానులకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరవబోతున్నాడట. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అకౌంట్లు ఓపెన్ చేసిన ఆయన.. దీనికి మాత్రం దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన ఫ్యాన్స్ కోసం ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. దీన్ని కేవలం సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ల కోసమే వాడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో మాత్రం సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పోస్టులను కూడా పెడుతోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న దీనిని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంలో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ రెండు చిత్రాలను ఒకేసారి పూర్తి చేసి.. ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమాను పట్టాలెక్కించాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











